విపక్షాల విమర్శలు..సెంట్రల్ విస్టా నిర్మాణస్థలంలో ఫొటోగ్రఫీ,వీడియో రికార్డింగ్ బ్యాన్

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

విపక్షాల విమర్శలు..సెంట్రల్ విస్టా నిర్మాణస్థలంలో ఫొటోగ్రఫీ,వీడియో రికార్డింగ్ బ్యాన్

Central Vista

Central Vista కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి దేశంలో అనేక మంది ప్రాణాలు తీస్తుంటే వేల కోట్లు ఖర్చు చేసి పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మించడం అవసరమా? అని ప్రతిపక్షాలు,యాక్టివిస్తులు ప్రశ్నిస్తున్నారు. సెంట్రల్‌ విస్తా నిర్మాణం వెంటనే ఆపి.. ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చును దేశంలో కరోనా కట్టడికి, ఆక్సిజన్, వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించాలని కాంగ్రెస్ సహా 12 ప్రతిపక్ష పార్టీలు బుధవారం ప్రధాని మోడీకి రాసిన లేఖలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇండియా గేట్ సమీపంలోని నిర్మాణ స్థలంలో ఫొటోగ్రఫీ, వీడియో చిత్రీకరణ‌ను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నిషేధించింది. అనుమతి లేకుండా లోనికి ప్రవేశించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు సెంట్రల్ విస్టా నిర్మాణ ప్రాంతంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేసింది.

ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తలపెట్టిన ప్రాజెక్టే.. ఈ సెంట్రల్ విస్టా. ఈ సెంట్రల్‌ విస్తా ప్రాజెక్టు ఇటీవలే పర్యావరణ అనుమతులను కూడా పొందింది. రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకూ ఉండే మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను నవీకరించనున్నారు. కొత్తగా త్రిభుజాకారపు పార్లమెంటు భవనం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, ప్రధానికి కొత్త నివాస భవనం,ఉప రాష్ట్రపతికి నివాస భవనం నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 13వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. డిసెంబర్‌ 2022 నాటికి ప్రధానమంత్రికి కొత్త ఇల్లు, ఉపరాష్ట్రపతి వచ్చే ఏడాది మే నాటికి నూతన గృహం పూర్తవుతుందని అంచనా.

అయితే సెంట్రల్ విస్టా నిర్మాణంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రభుత్వం కూడా ఘాటుగానే బదిలిస్తోంది. 70 ఏళ్లలో చేయలేని పనిని ప్రధాని నరేంద్ర అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో చేస్తుంటే.. వారికి అసూయ కలుగుతోందని బదులిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చేయాలనుకున్నదే.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తోందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.