PM Modi in Japan: ప్రపంచానికి దిక్సూచిగా భారత్: క్వాడ్ లీడర్ల ముందు వరుసలో ప్రధాని మోదీ

గతంలో భారత్ పాల్గొన్న ఈస్థాయి సమావేశాల్లో దేశ ప్రతినిధులు ఎవ్వరూ ఇలా ముందు వరుసలో రాలేదని..మోదీ తీసుకుంటున్న నిర్ణయాల వలనే మన దేశం ఇలా అగ్రభాగానికి చేరుకుంటుందని నెటిజన్లు అంటున్నారు.

PM Modi in Japan: ప్రపంచానికి దిక్సూచిగా భారత్: క్వాడ్ లీడర్ల ముందు వరుసలో ప్రధాని మోదీ

Modi

PM Modi in Japan: ప్రపంచానికి దిక్సూచిగా భారత్ నిలువనుందా?. మున్ముందు భారత్ ఆలోచనలతో మిగతా దేశాలు ఏకీభవించనున్నాయా?. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకోనుందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. క్వాడ్ కూటమి(భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా) నేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ..ఆదివారం జపాన్ చేరుకున్న సంగతి తెలిసిందే. భారత్ లో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ, జపాన్ – భారత్ మధ్యనున్న మైత్రి బంధాన్ని మరింత ధృడ పరుచుకుంటున్నాయని మోదీ అన్నారు. సోమవారం జపాన్ లోని పలు కార్పొరేట్ ప్రతినిధులతో సమావేశమైన ప్రధాని మోదీ..భారత్ లో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలపై పూర్తి వివరణ ఇచ్చారు. జపాన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి క్వాడ్ కూటమిలోని మిగతా దేశాధినేతలు సైతం పాల్గొన్నారు.

ఇదే పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తోనూ మంగళవారం భారత ప్రధాని ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అయితే అంతకముందు క్వాడ్ దేశాధినేతలతో జరిగిన శిఖరాగ్ర సమావేశ సమయంలో జపాన్ ప్రధాని ఫుమియో కీషీదాతో కలిసి భారత ప్రధాని మోదీ ముందువరుసలో నడుచుకుంటూ వెళ్లగా..ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ లు వెనుక వరుసలో ఉన్నారు. అది చూసిన వారికీ ప్రధాని మోదీనే మిగతా దేశాల నేతలను ముందుండి నడిపిస్తునట్టుగా ఉంది. అందుకు సంబందించిన ఫోటో ఒకటి మీడియాకు విడుదల కాగా..భారతీయ నెటిజన్లు ముఖ్యంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

other stories: Minister Mukhtar Abbas Naqvi : ‘కాంగ్రెస్ పార్టీ ఉనికి వెంటిలేటర్ పై ఉంటే..ఆ పార్టీ నేతల మూర్ఖత్వం యాక్సిలరేటర్ మీద ఉంది..’

గతంలో భారత్ పాల్గొన్న ఈస్థాయి సమావేశాల్లో దేశ ప్రతినిధులు ఎవ్వరూ ఇలా ముందు వరుసలో రాలేదని..మోదీ తీసుకుంటున్న నిర్ణయాల వలనే మన దేశం ఇలా అగ్రభాగానికి చేరుకుంటుందని నెటిజన్లు అంటున్నారు. కాగా, ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ సారధ్యంలోని భారత ప్రభుత్వం తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలు..ఇతర దేశాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.

other stories: Siddaramaiah Beef Row: అవసరమైతే బీఫ్ తింటా: సిద్ధ రామయ్య

యుక్రెయిన్ – రష్యా సంక్షోభంపై భారత్ స్పందించిన తీరు, రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు, అమెరికా ప్రభుత్వానికి భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ ఇచ్చిన కౌంటర్లు, శ్రీలంకకు ఆర్ధిక సహాయం, ఇతర మిత్ర దేశాలతో సఖ్యత వంటి వ్యవహారాల్లో భారత్ ఎంతో చురుకుగా వ్యవహరిస్తోంది. ఈక్రమంలో నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలే విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను మరింత పెంచినట్లు బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచిలా మారనుందని భారతీయ నెటిజన్లు అంటున్నారు.