కరోనా హాస్పిటల్ లో పందుల సంచారం

కరోనా హాస్పిటల్ లో పందుల సంచారం

కరోనా హాస్పిటల్ లో పందుల సంచారం

కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మరణాలు కూడా అధికంగానే ఉన్నాయి. అయితే ఓ వైపు ఆ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతుంటే, అక్కడి కల్బుర్గిలోని కరోనా రోగులు చికిత్స పొందుతున్న ప్రభుత్వ హాస్పిటల్ లో పందులు సంచరిస్తున్నాయి.

ఇప్పటికే కరోనా అంటు వ్యాధితో జనాలు పిట్టల్లా రాలిపోతుంటే దవాఖానలోనే పందులు తిరుగుతుండడంతో అంటు వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉందని దవాఖానలోని రోగులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే దీనిపై స్పందిస్తూ… తాను హాస్పిటల్ ను పరిశీలించానని, పందులు వార్డులోకి ఎలా ప్రవేశించాయో తెలియడం లేదని, ఈ జిల్లాపై ఉప ముఖ్యమంత్రి దృష్టి పెట్టలేదని ఆరోపించారు.

మరోవైపు కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ… తక్షణ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించామన్నారు. పందులను పట్టుకొని దవాఖాన వెలుపల వదిలేసినట్లు తెలిపారు. ఇంకోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

అయితే దేశంలో మొదటి కరోనా మరణం కల్బుర్గిలోనే సంభవించిన విషయం తెలిసిందే. కరోనా సోకిన రోగికి (76) సౌదీ అరేబియా నుంచి ఫిబ్రవరి 29న కల్బుర్గికి తిరిగి వచ్చి మార్చి 13న మరణించాడు.

×