అందరినీ గెలికేశాడు : మోడీ ట్వీట్లకు…విపక్షాలు మోత మోగించాయి

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 12:11 PM IST
అందరినీ గెలికేశాడు : మోడీ ట్వీట్లకు…విపక్షాలు మోత మోగించాయి

ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు సహకరించాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని రాజకీయ, క్రీడా,మీడియా, వ్యాపార, బాలీవుడ్ సహా పలు రంగాలకు చెందిన చెందిన ప్రముఖుల పేర్లను ట్యాగ్ చేస్తూ బుధవారం (మార్చి-13,2019) ప్రధాని మోడీ ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. మోడీ ట్యాగ్ చేసినవారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాయావతి,అఖిలేష్ యాదవ్ శరద్ పవార్, ఎంకే స్టాలిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనీల్ కుంబ్లే,వీవీఎస్ లక్ష్మణ్,వీరేంద్ర సెహ్వాగ్, బాలీవుడ్ నటులు బిగ్ బీ, విక్కీ కౌశల్,రణ్ వీర్ సింగ్,కరణ్ జోహార్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే మరికొందరు ప్రముఖులు ఉన్నారు.
Read Also : స్టిల్ బ్యాచిలర్ : సార్ కాదు.. రాహుల్ అని పిలవండి

నటీనటులందరికీ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారనీ.. తమదైన శైలిలో వారంతా ఓటు హక్కుపై ప్రచారం చేయాలని ప్రధాని మోడీ కోరారు. ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం కొత్త రికార్డు సృష్టించేలా..30 కోట్ల మంది భారతీయుల్లో చైతన్యం నింపాలని, ఇదే జరిగితే ప్రజాస్వామ్యం విజేతగా నిలుస్తుంది అని  వారిని ట్యాగ్ చేస్తూ మోడీ ట్వీట్ చేశారు.

రాహుల్,మమతా, మాయావతి, అఖిలేష్ యాదవ్ వంటి పలువురు రాజకీయనాయకులనుద్దేశించి ట్వీట్ చేస్తూ..మీరందరూ దశాబ్దాలుగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఓటు పవర్ ని మీరు అర్థం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనేలా ప్రజలను పోత్సహించి ప్రజాస్వామ్య పండుగను సంపన్నం చెయ్యాలని ట్వీట్ చేశారు.మన దేశ వయోజనులందరూ ఓటుహక్కు వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్య భారతానికి మంచిదని తన ట్వీట్లలో కోరారు.

ప్రధాని పిలుపుపై అఖిలేష్‌ స్పందిస్తూ.. ‘అవును. మోడీ నిజం చెప్పారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రధాని కోరుతున్నట్టు వారిలో పరివర్తన వస్తుంది. మా ఆలోచన అదే. మోడీ ఆలోచన కూడా మా ఆలోచన లాగే ఉంది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటే అది అధికార పార్టీని గద్దె దించేందుకు ఉపయోగపడుతుంది. ప్రధాని ఆకాంక్షిస్తున్నట్టు ప్రజలు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునివ్వబోతున్నారు.’ అని ట్విటర్‌ వేదికగా అఖిలేష్‌ రియాక్ట్‌  అయ్యారు. గంట వ్యవధిలోనే  29 ట్వీట్లు చేశారు మోడీ. ఏప్రిల్-11న ప్రారంభమయ్యే  ఎన్నికలు మే-19న పూర్తవనున్నాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Read Also : రాహుల్ కే షాక్ : సీఎం కేసీఆర్ తో సబిత, కార్తీక్ రెడ్డి భేటీ

అయితే దాదాపు 90మందికి పైగా ప్రముఖులను ట్యాగ్ చేసిన ప్రధాని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేరుని మాత్రం  ట్యాగ్ చేయలేదు. అయినప్పటికీ కేజ్రీవాల్ స్పందిస్తూ…మోడీది ఫాల్స్ అప్పీల్ అని అన్నారు. ఓటర్ లిస్ట్ ల నుంచి వందలాది మంది పేర్లు తొలగించబడ్డాయని ఆయన ఆరోపించారు.

నరేంద్రమోడీ ట్వీట్ కు స్పందించిన అక్షయ్ కుమార్..మోడీజీ మీరు చాలా బాగా చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యమే నిజమైన ప్రజాస్వామ్యానికి ముఖ్య లక్షణం అన్నారు. మన దేశం..అందులోని ఓటర్ల మధ్య ఓటింగ్ అనేది సూపర్ హిట్ ప్రేమ్ కథలా ఉండాలన్నారు. అమీర్ ఖాన్,కరణ్ జోహార్ తదితరులు మోడీ ట్వీట్ ని స్వాగతించారు.