రెమ్‌డెసివిర్ తీసుకువస్తున్న విమానం క్రాష్-ల్యాండ్‌

యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ స్టాక్‌తో ప్రయాణిస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వ విమానం సాంకేతిక లోపం కారణంగా నేపథ్యంలో గురువారం సాయంత్రం గ్వాలియర్ విమానాశ్రయంలో కుప్పకూలిందని పోలీసు ఉన్నతాధికారి

రెమ్‌డెసివిర్ తీసుకువస్తున్న విమానం క్రాష్-ల్యాండ్‌

Plane crash lands

Plane crash-lands : యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ స్టాక్‌తో ప్రయాణిస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వ విమానం సాంకేతిక లోపం కారణంగా గురువారం గ్వాలియర్ విమానాశ్రయంలో కుప్పకూలిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో పైలట్, కో పైలట్ లకు స్వల్ప గాయాలయ్యాయని గ్వాలియర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ సంఘి తెలిపారు.
విమానం రవాణా చేస్తున్న సరుకు రెమ్‌డెసివిర్ అని ఆయన అన్నారు.

ఈ సంఘటన రాత్రి 8.30 గంటల సమయంలో గ్వాలియర్ మహారాజ్‌పురా విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జరిగింది.. విమానం రన్‌వే నుండి కొంచెం దూరం ధాటి వెళ్లిందని ఎస్పీ చెప్పారు. COVID-19 రోగుల చికిత్స కోసం విస్తృతంగా ఉపయోగించబడుతున్న రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల కొరత దృష్ట్యా, ఔషధ రవాణా కోసం రాష్ట్ర ప్రభుత్వం తన విమానాలను ఉపయోగిస్తుంది.