Cashew : జీడి మామిడిలో పూత,కాత దశలో సస్యరక్షణ

జీడి మామిడిని ఆశించే తేయాకుదోమ టీ దోమ తోపాటు ఇతర ఆకు, కాయతినే పురుగులను నివారించేందుకు 3దశలుగా సస్య రక్షణ మందులు పిచికారి చేయాలి.

10TV Telugu News

Cashew :  జీడి మామిడి విస్తీర్ణము లోను ,ఉత్పత్తిలోను , ఆసియా ఖండంలో ప్రథమ స్థానంలో ఉంది, భారత దేశం 10.34 లక్షల హెక్టార్ల విస్తీర్ణం మరియు 6.70 లక్షల మెట్రిక్ టన్నుల ముడిగింజల ఉత్పత్తి కలిగి ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది . భారత దేశం లో మహరాష్ట్ర ఉత్పత్తిలోను , ఉత్పదకతలోను మొదటిస్తానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం జీడి మామిడి సాగును రైతులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు.

జీడిమామిడి సాగులో చీడపీడల సస్యరక్షణ చాలా ముఖ్యమైనది. జీడి మామిడిని వివిధ రకాల కీటకాలు ఆశించి నష్టం కలుగజేస్తాయి. జీడి మామిడి చెట్లను 60 రకాలకు పైగా కీటకాలు వివిధ పెరుగుదల దశలలో ఆశించి నష్టపరుస్తాయి. వాటిలో కాండం మరియు వేరు తొలుచు పురుగు జీడి మామిడి పూత మరియు పిందె దశలను ఆశించే పురుగులు ముఖ్యమైనవి.

జీడి మామిడి కాండం మరియు వేరు తొలుచు పురుగు : ఈ పురుగు జీడి మామిడి చెట్ల ఆగర్భ శత్రువుగా చెప్పవచ్చు . ఇది చెట్లను సమూలంగా నాశనం చేస్తుంది , ఇది ఎక్కువగా ముదురు తోటలో , నిర్లక్ష్యం చేయబడిన తోటలో కనిపిస్తుంది . జీడి మామిడి తోటలో ఏడాది పొడువునా ఈ పురుగు కనిపిస్తుంది జీడి మామిడి అయితె తొలకరిలో దీని వ్యాప్తి మరియు ఉధృతి ఎక్కువ ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు కొమ్మలు ఎండిపోయి చివరకు చెట్లు చనిపొతాయి . దీని నివారణకు పురుగు సొకిన చెట్లను మొదటి దశలోనే గుర్తించి పై బెరడును తొలచి కాండం , వేరు లోపల దాగి ఉన్న లద్దె పురుగులను ఇనుప చువ్వతో గుచ్చి బయటకు లాగి చంపివేయాలి .తొలగించిన బెరడు మీద క్లొరిఫైరిపాస్ 20 ఇ.సి మొందును 100 మి లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

 టీ దోమ: తేయాకు దోమ రసం పీల్చు పురుగుల రకానికి చెందినవి.తేయాకు దోమ జీడి చెట్ల లేత ఆకులు , పుష్ప గుచ్చాలు మరియు గింజలను ఆశించి రసం పీల్చడం వలన ఆశించిన భాగాలు మాడిపొతాయి . పక్వానికి రాని గింజలు ముందుగానే రాలిపోతాయి లేదా తయారైన గింజలపై మచ్చలు , చారలు ఏర్పడి మార్కెట్ విలువలు కోల్పొతాయి . ఈ దోమ ఉధృతి ఎక్కువగా ఉంటే చెట్టు మత్తం కాలి పోయినట్లుగా కనిపిస్తుంది .

ఈ దోమ పిల్ల దశ మరియు తల్లి దశల్లో లేత కొమ్మలను , పూత రెమ్మలను ఆశించి రసాన్ని పీల్చుట వలన ఎర్రని జిగురు కారుచు , పూత రెమ్మల మీద నల్లని పొడువుగల మచ్చలు ఏర్పడతాయి . తరువాత పూత , పిందెలు మాడిపొతాయి రాలి పోవుట వలన దిగుబడి తగ్గుతుంది .తేయాకు దోమ ప్రభావం వలన 30-40% జీడి మామిడి దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ తేయాకు దోమ జీడి మామిడి చెట్లనె కాకుండ తేయాకు,కోకో,జామ ,వేప,మిరియాలు,ద్రాక్ష,చింత,దాల్చిన చెక్క మొదలగు ఇతర పంటలను కూడ ఆశిస్తుంది . ఈ దోమ సాదారణంగా అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు జీడి మామిడి తోటల్లో కనిపిస్తుంది.

ఆకు తినే పురుగు: జీడి మామిడి చెట్లను చాల రకాల ఆకు తినే పురుగులు ఆశిస్తాయి. ఇవి ఆకులను పూర్తిగా తినడం వలన నష్టం కలుగుతుంది.వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఆకులనే కాకుండ పుష్ప గుచ్చలను, గింజలను కూడా తినడం వలన పంట దిగుబడి తగ్గుతుంది.

ఆకు తొలుచు పురుగు : ఈ పురుగు చెట్టు చిగురు దశ లో ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి రెక్కల పురుగు లేత ఆకులపై గూడ్లు పెడతాయి ,గుడ్ల నుండి పొదిగిన గొంగళి పురుగులు లేత ఆకులపై పోరలను తొలిచి లోపల ఉంటూ జీవకణాలను తింటూ పెరుగుతాయి. దీని వలన ఆకుల మీద తెల్లని బొబ్బలు ఏర్పడతాయి. ఆకులపై తెల్లటి బొబ్బలు గమనించడం ద్వారా ఈ కీటకం చెట్లను ఆశించినట్లు ,గుర్తించవచ్చు .తరువాత ఈ తెల్లటి మచ్చలు బొబ్బలు ఎండిపోయి రాలిపోతాయి .దాని ద్వారా ఆకులపై పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడతాయి. లేత మొక్కలకు ఈపురుగు వల్ల హాని ఎక్కువగా జరుగుతుంది.

ఆకు,పుష్ప గుచ్చం గూడుకట్టుకొను పురుగు : ఈ పురుగు వల్ల లేత మొక్కలకు హాని ఎక్కువగా జరుగుతుంది. ఈ పురుగు ఆశించిన ఆకులు నిర్జీవమై ఎండి పోతాయి. పూలు వికసించవు. ఈ కీటకము ఎదుగుతున్న జీడి గింజలను, జీడి పండ్లను కూడా ఆశించి వాటి నుండి జీవరసమును పీల్చడం వలన అవి త్వరగా రాలి పోతుంది. లేత ఆకులను ,పుష్ప గుచ్చములను తినటం వల్ల పూత రాకపోను, ఫలసాయం తగ్గుతుంది. ఎదుగుతున్న గింజలను ,పండ్లను నాశనం చేయడం వలన కూడా దిగుబడి తగ్గిపోతుంది.

కొమ్మల చివర గల బూజు గుళ్ళ వలన ఈ కీటకము ఉనికిని గుర్తించవచ్చు . ఈ గొంగళి పురుగులు గుళ్ళలో ఉండటం వలన క్రిమి సం హారక మందులు అందక సురక్షితంగా ఉంటుంది . అందువల్ల ఈ గుళ్ళను చెదర్చె మందులను పిచికారి చేయాలి. నిరోధక చర్యగా పూత వచ్చే వారం పది రోజులు మందు క్రిమి సంహారక మందులను పిచికారి చేయాలి.

ఆకు ముడత పురుగు : ఈ పురుగు కూడా చెట్టు చిగురు దశలో ఎక్కువగా ఆశిస్తుంది .ఈ పురుగు ఆశించడం వలన ఆకు చివరలు ముడుచుకొనిపొతాయి ,తల్లి రెక్కల పురుగులు లేత ఆకులపై గుడ్లను పెడతాయి. ఈ గుడ్లు నుండి పొదిగిన గొంగళి పురుగులు ఆకును ముడిచి లోపల నుండి పత్రహారితాన్ని గీకి తింటాయి. ఫలితంగా కిరణజన్య సం యోగ క్రియ సరిగా జరగక దిగుబడి తగ్గుతుంది. ఈ గొంగళి పురుగులు ఆకు ముడతలలోనే కొశస్థ దశ చేరుకుంటాయి.

కొమ్మ మరియు పుష్పగుచ్చముల చివర్లను తొలుచు పురుగు : ఈ పురుగు లేత కొమ్మలు, పుష్ప గుచ్చాల చివర్లను తొలిచి, సొరంగం చేసి లోపలి గుజ్జు తింటుంది .అందువలన లేత కొమ్మలు, పుష్ప గుచ్చాలు ఎండిపొతాయి ఫలితంగా గింజలు ఏర్పడక దిగుబడి తగ్గుతుంది.

కాయ, గింజ తినే పురుగు: ఈ పురుగు చెట్లపై కాయ, గింజ ఏర్పడినప్పటి నుండి అవి తయారయ్యే దశ వరకు అంటే దాదాపుగా ఫిబ్రవరి మాసం నుండి మే వరకు కనిపించును ఈ పురుగు కయ , గింజ మద్యగల ప్రవేషం ద్వార లేదా గింజ పైన గల నొక్కు ద్వారా గాని లోపలికి ప్రవేశించి పండులోని గుజ్జును , గింజలోని పువ్వును తింటుంది ఫలితంగా గింజలు,కాయలు ఎదగక కుళ్ళి పోయి రాలిపోతాయి .

తామర పురుగులు: వర్షాకాలంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తల్లి మరియు పిల్ల పురుగులు పూ గుచ్చాలను , పండ్లను ,గింజలపై గీకి రసాన్ని పీల్చి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి.ఫలితంగా పు గుచ్చాలు .జీడి పండ్లను మరియు గింజలపై భాగం గరుకుగా తయారై నాణ్యత కోల్పోతాయి. ఈ పురుగు ఉధృతి అధింకగా ఉన్నపుడు పండు పై పగుల్లు ఏర్పడడమే కాకుండ గింజలు కూడా రాలిపోతాయి .

నివారణ పద్ధతులు :

జీడి మామిడిని ఆశించే తేయాకుదోమ టీ దోమ తోపాటు ఇతర ఆకు, కాయతినే పురుగులను నివారించేందుకు 3దశలుగా సస్య రక్షణ మందులు పిచికారి చేయాలి. మొదటిసారి కొత్త చిగురు వచ్చే సమయంలో మోనోక్రొటోఫాస్ మందును ఒక లీటరు నీటికి 1.6 ఎం. ఎల్ కలిపి పిచికారి చేయాలి. రెండవసారి పూత సమయంలో క్లోరిఫైరిఫాస్ మందును ఒక లీటరు నిటికి 20 మి.లీ (లేదా) సైహలోథ్రిన్ మందును 0.8 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి కొమ్మలు బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి .ఈ దశలో ఎక్కువగా పూత మాడిపోవడం జరుగుతుంది కనుక దానిని నివారించుటకు పైన తెలిపిన మందుతొ పాటుగా కార్బండిజం, అనే పోడి మందును ఒక లీతరు నిటికి 1 గ్రా .చొప్పున కలపాలి. ముడవసారి గింజ బఠాణి సైజులో ఉన్నప్పుడు ప్రొఫైనోఫాస్ మందును ఒక లీటరు నీటికి 1 మి.లీ కలిపి పిచికారి చేయాలి .

రైతులు జీడిమాడి సాగులో తగిన మెళుకువలు పాటిస్తూ చీడపీడలను నివారించుకుంటే మంచి దిగుబడులు సాధించటంతోపాటు, మంచి నాణ్యతను పొందవచ్చు.

×