Plasma Therapy : ప్లాస్మా థెరపీకి గుడ్ బై…? కరోనా మరణాల రేటుని తగ్గించడం లేదా?

కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీతో ప్రయోజనం శూన్యమా? ప్రాణాలు తోడేస్తున్న కరోనాను ప్లాస్మా థెరపీ కంట్రోల్ చెయ్యడం లేదా? ప్లాస్మా థెరపీ సమర్థతపై సందేహాలు ఎందుకొస్తున్నాయి? వైద్యుల ఫిర్యాదులపై ఐసీఎంఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Plasma Therapy : ప్లాస్మా థెరపీకి గుడ్ బై…? కరోనా మరణాల రేటుని తగ్గించడం లేదా?

Plasma Therapy

Plasma Therapy : కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీతో ప్రయోజనం శూన్యమా? ప్రాణాలు తోడేస్తున్న కరోనాను ప్లాస్మా థెరపీ కంట్రోల్ చెయ్యడం లేదా? ప్లాస్మా థెరపీ సమర్థతపై సందేహాలు ఎందుకొస్తున్నాయి? వైద్యుల ఫిర్యాదులపై ఐసీఎంఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ప్లాస్మా థెరపీతో ప్రయోజనం లేదు:
కరోనా రోగులకు ప్లాస్మాతో చికిత్స చేయవచ్చని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. ఇప్పటికీ దీన్ని అమలు చేస్తున్నారు. దీని కోసం సోషల్ మీడియాలో ప్లాస్మా దానం చేయండి అంటూ విపరీతమైన సందేశాలు వెలువడుతున్నాయి. అలాంటి వాటన్నింటిని కొట్టిపారేస్తున్నారు పరిశోధకులు. ప్లాస్మా థెరపీతో అసలు ప్రయోజనమే లేదని తేల్చి చెబుతున్నారు. కోవిడ్ చికిత్సలో ఇప్పటివరకు ఎంతో కీలకంగా భావిస్తున్న ప్లాస్మా థెరపీ అనుకున్నంత సమర్థవంతంగా పని చెయ్యడం లేదా? అంటే, అవుననే తేలిందంటున్నారు నిపుణులు. ప్లాస్మా థెరపీ కరోనా మరణాల రేటుని తగ్గించడం లేదని ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది.

ప్లాస్మాతో కరోనావైరస్ మరింత బలపడే అవకాశం:
39 ట్రయల్ సెంటర్లలో 464 కోవిడ్ పేషెంట్లలో ప్లాస్మాను ప్రవేశ పెట్టి పరీక్షించగా, అందులో ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ప్లాస్మా థెరపీ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా 18మంది వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణుల బృందం ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్లాస్మా థెరపీ
కరోనా వైరస్ జాతులను పెంచడానికి సహకరిస్తుందని ఆరోపించారు. దీంతో వైరస్ మరింత బలపడే చాన్స్ ఉందనేది ఆరోగ్య నిపుణుల వాదన. మరోవైపు ప్లాస్మా చికిత్స మార్గదర్శకాలు శాస్త్రీయంగా లేవని నిరూపిస్తున్న పలు అధ్యయనాలను నిపుణులు ఈ లేఖలో ప్రస్తావించారు.

తగ్గని కరోనా మరణాల రేటు:
భారత్ లో నిర్వహించిన అనేక పరిశోధనల ఆధారంగా కరోనా రోగుల చికిత్సలో ప్లాస్మా థెరపీ ప్రభావవంతంగా లేదని తేల్చి చెప్పేస్తున్నారు వైద్యులు, శాస్త్రవేత్తలు. ఇతర దేశాల్లోనూ ప్లాస్మా థెరపీ అంత ఫలితాన్ని చూపించలేదని తెలుస్తోంది. బ్రిటన్ లో 11వేలమందిపై నిర్వహించిన పరీక్షల్లో ప్లాస్మా థెరపీ ఎటువంటి ఫలితాన్ని చూపలేదని తెలిసింది. అర్జెంటీనాలోనూ సేమ్ ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. అక్కడా వైద్యులు ప్లాస్మా చికిత్సను సమర్థవంతంగా పరిగణించ లేదు.

ప్లాస్మా థెరపీపై నిషేధం?
ఇక ప్లాస్మా థెరపీపై భిన్నవాదనలు వినిపిస్తూ ఉండటంతో ఐసీఎంఆర్ కీలక సమావేశం నిర్వహించింది. ప్లాస్మా చికిత్స ప్రోటోకాల్ కు సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలను జారీ చేయవచ్చని, కరోనా రోగుల చికిత్సకు ప్లాస్మా థెరపీ ఉపయోగించడాన్ని నిషేధించే అవకాశం ఉందని తెలుస్తోంది.