Plastic Prohibition: 2022 నుంచి ఆ ప్లాస్టిక్ వస్తువులు కనిపించవు

ప్లాస్టిక్ తో తయారుచేసిన క్యాండీ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ 2022 జనవరి 1నుంచి కనిపించవని కేంద్రం పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్వైరీ మీద రెస్పాండ్ అయిన కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే ఈ సంవత్సరం ఆరంభంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు.

Plastic Prohibition: 2022 నుంచి ఆ ప్లాస్టిక్ వస్తువులు కనిపించవు

Plastic Prohibition

Plastic Prohibition: ప్లాస్టిక్ తో తయారుచేసిన క్యాండీ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ 2022 జనవరి 1నుంచి కనిపించవని కేంద్రం పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్వైరీ మీద రెస్పాండ్ అయిన కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే ఈ సంవత్సరం ఆరంభంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు.

ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కనిపించకుండా చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు. ప్లాస్టిక్ తో తయారుచేసిన ఇయర్‌ బడ్స్, బెలూన్‌ స్టిక్స్, ప్లాస్టిక్‌ జెండాలు, క్యాండీ పుల్లలు, ఐస్‌ క్రీమ్‌ పుల్లలు, పాలీస్టెరెన్ (థర్మాకోల్), ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్స్, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, కంటైనర్లు, ట్రేలు, పీవీసీ బ్యానర్లు, 100మైక్రోన్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ వస్తువులన్నీ.. వచ్చే ఏడాది జులై నాటికి కనిపించకూడదనేది ప్లాన్.

డెకరేషన్‌ చేసేందుకు ఉపయోగించే పాలీస్టైరిన్‌లు జనవరి 1 నాటికి ఉపయోగించకుండా చూసే ప్రక్రియ సాగుతోందని అన్నారు. రీసైకిల్డ్‌ క్యారీ బ్యాగులను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి మార్కెట్‌లో అందుబాటులో లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్, 2016ను ఇంప్లిమెంట్ చేస్తూ.. చర్య దిశగా అడుగులేయాలని అన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తామంతట తాముగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని చెప్పారు. దీనిపై యాక్షన్ ప్లాన్ రచించి పద్ధతి ప్రకారం ప్రొసీడ్ అవ్వాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే 14రాష్ట్రాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సాయంతో దీనిపై చర్యలు మొదలుపెట్టేశామని చెప్పారు.