Uttarakhand Election : హైకమాండ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్

వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన మాజీ సీఎం హరీష్ రావత్ బుధవారం

Uttarakhand Election : హైకమాండ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్

Rawat5

Uttarakhand Election : వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన మాజీ సీఎం హరీష్ రావత్ బుధవారం ఒక్కసారి పార్టీ అగ్రనాయకత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రైతే త‌న‌ను ఈద‌మంటున్నారో… వారే త‌న కాళ్లు, చేతులు క‌ట్టిపారేశార‌ని అధిష్ఠానంపై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. త‌న విషయంలో పార్టీ తీవ్ర వివ‌క్ష‌త‌ను చూపుతోంద‌ని మండిప‌డ్డారు. ఈ మేరకు రావత్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ముద్ర‌ప‌డ్డ రావత్ తన ట్వీట్ లో…”చూడండి.. ఎంత చిత్ర‌మో.. ఎన్నిక‌ల‌ స‌ముద్రంలో ఈద‌మ‌న్నారు. ఈద‌డానికి త‌గిన మ‌ద్ద‌తివ్వాల్సింది పోయి… వెన్నుపోటు పొడుస్తోంది ఆర్గనైజేషన్‌. నాకు వ్య‌తిరేకంగా పాత్ర పోషించ‌డానికి సిద్ధ‌ప‌డిపోయింది. ఈత కొట్ట‌మ‌ని దింపేశారు. దాంతో పాటు కొన్ని మొస‌ళ్ల‌ను కూడా జార‌విడిచారు. కాళ్లు, చేతులు క‌ట్టేసి ఈత కొట్ట‌మంటున్నారు. అలిసిపోయా.. ఇక చాల‌నిపిస్తోంది. విశ్రాంతి తీసుకోవాల‌నిపిస్తోంది. కొత్త సంవ‌త్స‌రం ఓ దారిని చూపిస్తుంద‌ని ఆశాభావంతోనే ఉన్నా. కేదారేశ్వ‌రుడు ఓ కొత్త మార్గాన్ని చూపిస్తాడ‌ని విశ్వాసంతోనే ఉన్నా” అని పేర్కొన్నారు.

కాగా, కొద్ది నెలల క్రితం పంజాబ్ లో మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌, సిద్దూ మ‌ధ్య తీవ్ర విభేదాలు తలెత్తి, పంజాబ్‌లో పార్టీ పుట్టి మునుగుంద‌న్న స‌మ‌యంలో అక్క‌డి వెళ్లి, ఇరు నేత‌ల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చి, పంజాబ్ రాజ‌కీయాల‌ను గాడిలో పెట్టిన దిట్ట రావ‌త్. అయితే ఆయనే ఇప్పుడు హైకమాండ్ పై తీవ్ర స్వరం వినిపించడంతో..ఉత్తరాఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలో రావత్ తన కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం కూడా లేకపోలేదని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి.

ALSO READ Electric Vehicle : కేంద్రం బంపర్ ఆఫర్.. ఎలక్ట్రిక్ వాహనం కొంటే ‘లక్షన్నర’ వరకు ఆదా