బుడ్డొడి మాటలు వినండి..పాటించండి – సెహ్వాగ్ 

కరోనా వైరస్ నుంచి అప్రమత్తంగా ఉండండి..ఆరోగ్యాన్ని కాపాడుకొండి..అంటూ ఎంతో మంది ప్రముఖులు ప్రజలకు సలహాలు, సూచనలిస్తున్నారు. ఇందులో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ఎంతో మంది ఉన్నారు. వారి వారి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అందులో టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఒకరు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఇది కూడా కరోనాకు సంబంధించిందే. అయితే..ఇక్కడ ఆయన ఏమీ చెప్పలేదు. ఓ బుడ్డొడు చెబుతున్న వీడియోను పోస్టు చేశారు. ఓ బుడతడు తన బుజ్జిబుజ్జి మాటలతో చెప్పిన విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ వీడియో సెహ్వాగ్ కంటపడింది. వెంటనే రీ పోస్టు చేశారు. చిన్నారి చెబుతున్న మాటలను శ్రద్ధగా వినాలని విజ్ఞప్తి చేశాడు.

చాలా ముఖ్యమైన విషయం..ఆ చిన్న పిల్లాడు ఎంతో అందంగా కరోనా వైరస్ గురించి చెబుతున్నాడని, ఇతని మాటలు ప్రతొక్కరూ వినండి..అలాగే పాటించండి..అంటూ సెహ్వాగ్ వెల్లడించాడు. ఇటీవలే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలువురు ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సంగతి తెలిసిందే. దేశ ప్రజలను జాగృతి చేయాల్సినవసరం ఉందని మోడీ సూచించారు. 
 

×