యువకుల శివుడి గాన భజన, బహుత్ బడియా అన్న మోడీ

యువకుల శివుడి గాన భజన, బహుత్ బడియా అన్న మోడీ

Lord Shiva

Lord Shiva Song : శివరాత్రి వచ్చేస్తోంది. 2021, మార్చి 11వ తేదీ గురువారం శైవ క్షేత్రాలన్నీ శివోహంతో మారుమ్రోగనున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న శివుడి ఆలయాలను అందంగా అలంకరించారు. ధగధగలాడే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయాలకు ఇప్పటికే భక్తులు చేరుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా పలు ఛానెళ్లు, ఇతరులు శివుడి కీర్తనల వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. శివరాత్రి వచ్చిందంటే చాలు భక్త జనకోటి శివోహం అంటూ భక్తితో ఊగిపోతుంటారు.

ఇలాగే..ఇద్దరు యువకులు శివ గానం చేశారు. దీనికి సంబంధించి వీడియో తెగ వైరల్ గా మారింది. చాలా మంది లైక్ చేస్తున్నారు. వీరి టాలెంట్ అదరహో అంటున్నారు. ఈ వీడియోపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి వచ్చింది. వారి గానానికి ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. “బహుత్ బడియా(చాలా బాగుంది) ” అంటూ ట్వీట్ చేశారు. వీరి గానామృతం ముందు ఏ సింగర్స్, హీరోలు పనికి రారు..దయ చేసి లోకల్ టాలెంట్ ను సపోర్ట్ చేయండి” అంటూ ఆ వీడియోను బ్రిజేష్ చౌదరి అనే వ్యక్తి పోస్ట్ చేయగా ప్రధాని ఇలా రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.