MP Pragya Thakur : ఎంపీలకు ప్ర‌జ్ఞా ఠాకూర్‌ యోగా క్లాస్..కాంగ్రెస్ విమర్శలు

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే భోపాల్ బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్‌...ఎంపీల‌కు యోగా క్లాసు తీసుకోనున్నారు.

MP Pragya Thakur : ఎంపీలకు ప్ర‌జ్ఞా ఠాకూర్‌ యోగా క్లాస్..కాంగ్రెస్ విమర్శలు

Pm Changed His Mind Congress On Pragya Thakurs Yoga Session For Mps

MP Pragya Thakur తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే భోపాల్ బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్‌…ఎంపీల‌కు యోగా క్లాసు తీసుకోనున్నారు. ఈనెల 21వ తేదీన అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ యోగా దినోత్పవం రోజున ఎంపీలందరికీ నాలుగు ఆన్ లైన్ సెషన్ల ద్వారా యోగా క్లాసులు నిర్వహించాలని లోక్ సభ నిర్ణయించింది.

పార్ల‌మెంట‌రీ రీస‌ర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్‌టిట్యూట్ ఫ‌ర్ డెమోక్ర‌సీస్ శాఖ యోగా సెష‌న్‌ ను ఏర్పాటు చేస్తోంది. ఈ విష‌యాన్ని లోక్‌స‌భ సెక్ర‌టేరియేట్ ఓ ప్ర‌క‌ట‌న‌ విడుదల చేసింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను గురువారమే ఎంపీలందరికీ పంపిచారు. మొత్తం నాలుగు భాగాలుగా యోగా కార్య‌క్ర‌మాలు ఉండనుండగా..ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్‌.. యోగా: ఏ వే ఆఫ్ లైఫ్ అన్న అంశంపై పార్లమెంట్ సభ్యులకు క్లాసు తీసుకోనున్నట్లు(హోస్ట్ గా వ్యవహరిస్తారు) లోక్ సభ ప్రకటనలో పేర్కొంది.

అయితే ప్ర‌జ్ఞా ఠాకూర్‌ యోగా క్లాస్ విషయమై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఉగ్రవాద నిందుతురాలకి కేంద్రం ఇచ్చిన ఫ్లాట్ ఫాం ఇదని కాంగ్రెస్ విమర్శించింది. గాఢ్సే భక్తులను కేంద్రప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్ర‌జ్ఞా ఠాకూర్‌ విషయంలో ప్రధాని తన మనసు మార్చుకున్నారా అని కాంగ్రెస్ ఎంపీ యానిక్కం ఠాకూర్ ప్రశ్నించారు. కాగా, 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో,ఆ తర్వాత కూడా మహాత్మ గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేని దేభక్తుడిగా ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్‌ అభివర్ణించిన విషయం తెలిసిందే. పలు రెచ్చేగొట్టే వ్యాఖ్యలు కూడా ామె చేసింది. ప్ర‌జ్ఞా ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవడంతో ఆమెను రక్షణశాఖకు సంబంధించిన పార్లమెంటరీ ప్యానల్ నుంచి తొలగించమే కాకుండా బీజేపీ పార్లమెంటరీ మీటింగ్స్ నుంచి దూరం పెట్టారు. ప్రధాని మోదీ కూడా ప్ర‌జ్ఞా ఠాకూర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన విషయం తెలిసిందే. కాగా, 2008 మాలేగావ్ బాంబేపేలుళ్ల కేసులో నిందితురాలుగా ఉన్న ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్‌ బెయిల్ పై బయటకి వచ్చారు. ఆరోగ్య కారణాలను ప్రస్తావిస్తూ ఆమె స్పెషల్ కోర్టు విచారణకు కూడా హాజరుకాలేదు.