PM KISAN : రైతులకు శుభవార్త.. డిసెంబర్‌లో ఖాతాల్లోకి నగదు

డిసెంబ‌ర్‌-మార్చి విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ నగదును డిసెంబర్ మూడో వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది కేంద్రం.

PM KISAN : రైతులకు శుభవార్త.. డిసెంబర్‌లో ఖాతాల్లోకి నగదు

Pm Kisan

PM KISAN : రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి. ఈ స్కీమ్ కింద కేంద్రం.. రైతుల‌కు మూడు విడతల్లో ఏటా రూ.6 వేలు న‌గ‌దు జమ చేస్తున్న విష‌యం తెలిసిందే. డిసెంబ‌ర్‌-మార్చి విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ నగదును డిసెంబర్ మూడో వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది కేంద్రం.

Petrol : వాహనదారులకు గుడ్‌న్యూస్.. మరింత తగ్గనున్న పెట్రోల్ ధరలు..!

డిసెంబ‌ర్ 15 నుంచి 25 మ‌ధ్య 10వ విడత నిధులను జమ చేసేందుకు కేంద్రం సిద్ధమైందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకోసం సుమారు రూ.22 వేల కోట్లు రిలీజ్ చేయనుంది. కాగా, ఈసారి వెస్ట్ బెంగాల్ లోని 15లక్షల మంది రైతులనూ కలపడంతో ఈ పథకంలో లబ్ది పొందుతున్న వారి సంఖ్య 11 కోట్లు దాటనుంది. కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు మూడు విడతల్లో నగదును జమ చేస్తూ వస్తోంది. మూడు త్రైమాసికాల్లో రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాలో నగదు జమ అవుతోంది.

Computer Work : గంటల కొద్దీ కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లతో గడిపేవారికి వచ్చే వ్యాధులు ఇవే

మోదీ సర్కార్ ఇప్పటికే పీఎం కిసాన్ స్కీమ్ కింద 9 విడతల నగదను జమ చేసింది. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ డబ్బులు క్రెడిట్ అయ్యాయి. ఇప్పుడు పదో విడత డబ్బులు రావాల్సి ఉంది. ఇవి వచ్చే నెలలో రైతులకు అందనున్నాయి.