PM Kisan FPO Yojana : కేంద్రం కొత్త పథకం.. రూ.15లక్షలు తీసుకోవచ్చు

రైతే రాజు అంటారు. దేశానికి వెన్నుముక అని చెబుతారు. ఇంతమందికి కడుపు నిండా ఆహారం దొరుకుతోంది అంటే, ఆకలి తీరుతోంది అంటే దానికి కారణం అన్నదాతే. అలాంటి రైతుకి ఏం చేసినా తక్కువే.

PM Kisan FPO Yojana : కేంద్రం కొత్త పథకం.. రూ.15లక్షలు తీసుకోవచ్చు

Pm Kisan Fpo Yojana

PM Kisan FPO Yojana : రైతే రాజు అంటారు. దేశానికి వెన్నుముక అని చెబుతారు. ఇంతమందికి కడుపు నిండా ఆహారం దొరుకుతోంది అంటే, ఆకలి తీరుతోంది అంటే దానికి కారణం అన్నదాతే. అలాంటి రైతుకి ఏం చేసినా తక్కువే. ఈ క్రమంలో రైతులకు సాయం చేయడానికి, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచడానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకొచ్చింది. పీఎం కిసాన్ నిధి, ఫసల్ బీమా వంటి పథకాలు అందులో భాగమే. అన్నదాతలు వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా మరింతగా ఎదిగేందుకు కేంద్రం అవకాశం కల్పిస్తోంది.

తాజాగా రైతుల కోసం కేంద్రం మరో పథకాన్ని తీసుకొచ్చింది. అదే ‘పీఎం కిసాన్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ స్కీమ్‌ యోజన’ (PM Kisan FPO). ఈ పథకం కింద రైతులు అగ్రికల్చర్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి మోదీ ప్రభుత్వం రూ.15 లక్షల ఆర్థిక మద్దతు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఈ స్కీమ్‌ను ప్రకటించింది. పీఎం కిసాన్ ఎఫ్‌పిఓ పథకం కింద రైతు ఉత్పత్తి సంస్థకు రూ.15 లక్షలు ఇవ్వనున్నారు.

ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే 11 మంది రైతులు కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ చట్టం కింద దీనిని రిజస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత దీని ద్వారా వచ్చే డబ్బులను విత్తనాలు, మందులు, ఎరువులు, ఇతర పరికరాలు రైతులకు విక్రయించుకోవచ్చు. త్వరలోనే ఈ స్కీమ్ రిజిస్ట్రేషన్, విధివిధానాలను కేంద్రం ప్రకటించనుంది. 2023-24 నాటికి 10 వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.