ఆధార్ మస్ట్, కుటుంబంలో ఒక్కరికే : పీఎం కిసాన్‌కు కండీషన్స్

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకం ఇది. ఇటీవల ప్రవేశపెట్టిన

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 02:05 AM IST
ఆధార్ మస్ట్, కుటుంబంలో ఒక్కరికే : పీఎం కిసాన్‌కు కండీషన్స్

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకం ఇది. ఇటీవల ప్రవేశపెట్టిన

ఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకం ఇది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ  స్కీమ్‌ను అనౌన్స్ చేశారు. ఈ పథకం కింద రైతులకు ఏటా 6వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు. మూడు విడతల్లో ఆ అమౌంట్‌ను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. అయితే పీఎం  కిసాన్‌కు అప్లయ్ చేసుకోవాలంటే అర్హతలు ఏంటి? కండీషన్స్ ఏంటి? ఎవరెవరిని అర్హులుగా పరిగణిస్తారు? అసలు గైడ్ లైన్స్ ఏంటి? ఇలాంటి సందేహాలు అనేకం.

 

ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. పీఎం కిసాన్‌ పథకం కింద ఆర్థిక సాయం అందాలంటే పలు నిబంధనలు పెట్టింది. ఆధార్‌ నంబర్‌ తప్పనిసరిగా ఉండాలని చెప్పింది. రైతులు తమ  గుర్తింపు కార్డు కింద ఆధార్‌ నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2019 మార్చిలో ఇచ్చే తొలి విడతలో మాత్రం ఇది ఆప్షనల్ అని పేర్కొంది. తొలి విడత నగదు పొందేందుకు ఆధార్‌కు  బదులుగా డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటర్‌ ఐడీ కార్డు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. రెండో విడత నుంచి నగదు పొందాలంటే మాత్రం ఆధార్‌ మస్ట్.  దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు 2019, ఫిబ్రవరి 4వ తేదీన సోమవారం లేఖ రాసింది. అర్హులైన రైతుల గుర్తింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి త్వరగా లబ్ధి  కలిగేలా చూడాలని సూచించింది. దీనిపై విడతల వారీగా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు విధివిధానాలు తెలియజేస్తామని స్పష్టంచేసింది.

 

* పీఎం-కిసాన్ మంజూరుకు రైతు కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటారు.
* కుటుంబం అంటే భర్త, భార్య, ఇద్దరు పిల్లలు (18 ఏళ్లలోపు). వీరందరికీ కలిపి 5ఎకరాల లోపు సొంత సాగుభూమి ఉండాలి. అలాగైతేనే అర్హులు.

* 2018 డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేసే పథకానికి 2019 ఫిబ్రవరి 1 నాటికి ఉన్న భూ దస్త్రాలనే పరిగణనలోకి తీసుకుంటారు.
* 2018 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2019 మార్చి 31వ తేదీ కాలానికి ఒక విడత మొత్తాన్ని మార్చి నెలాఖరు నాటికి రూ.2వేలు ఇస్తారు.
* లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్రాల్లో ఉండే భూ దస్త్రాల నమోదు విధానాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు.
* 2019 ఫిబ్రవరిలోగా భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలు ఆన్‌లైన్‌లో నమోదై ఉన్న వారినే అర్హులుగా గుర్తిస్తారు.
* ఒక రైతు కుటుంబానికి వివిధ గ్రామాలు/రెవెన్యూ గ్రామాల్లో ఉన్నవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు.
* ఫిబ్రవరి తర్వాత కొత్తగా భూమి యాజమాన్య హక్కులు వచ్చే వాటిని 5ఏళ్ల దాకా పరిగణనలోకి తీసుకోరు. అప్పటికే పథకం వర్తించే ఖాతాలకు సంబంధించిన భూముల యాజమాన్య  హక్కులను వారసులకు బదిలీ చేస్తే ప్రయోజనం వర్తింపజేస్తారు.
* కొన్ని రాష్ట్రాల్లో కౌలు రైతులు పీఎం-కిసాన్‌ పథకం ప్రయోజనాలకు దూరమయ్యే పరిస్థితులున్నాయి. ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమూనా కౌలుదారు చట్టాన్ని  అనుసరిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

 

పీఎం కిసాన్‌కు అర్హుల జాబితాను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫిబ్రవరి 1 నాటికి భూరికార్డుల్లో పేర్లు నమోదైన యజమానులే ఈ పథకానికి అర్హులని  స్పష్టం చేసింది. రైతుకు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో భూములు ఉన్నట్లు గుర్తిస్తే.. ఆ భూములన్నింటిని కలిపి పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అలాగే పీఎం కిసాన్‌ పథకం అమలుకు  సంబంధించి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార సంఘాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో నోడల్‌  యూనిట్లను, కేంద్ర స్థాయిలో పర్యవేక్షణ విభాగాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది.