రైతులకు అలర్ట్.. PM KISAN డబ్బులకు కొత్త రూల్.. ఆ కార్డు మస్ట్..

రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీమ్ కింద ప్రతి ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో

రైతులకు అలర్ట్.. PM KISAN డబ్బులకు కొత్త రూల్.. ఆ కార్డు మస్ట్..

Pm Kisan Samman Nidhi Yojana

PM KISAN : రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీమ్ కింద ప్రతి ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. 10వ విడత నగదును డిసెంబర్ 15న రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు దేశంలోని 11.37 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం రూ.1.58 లక్షల కోట్లను బదిలీ చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందాలనుకునే రైతులు అక్టోబర్ 30 లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి.

Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?

కాగా, పీఎం కిసాన్ పథకం కింద మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి ప్రభుత్వం డాక్యుమెంట్ నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. పీఎం కిసాన్ ప్రయోజనాలను పొందాలంటే ప్రభుత్వం రేషన్ కార్డును తప్పనిసరి చేసింది. అర్హులైన వ్యవసాయ కుటుంబాలు ఇప్పుడు తమ రేషన్ కార్డ్ నంబర్, వాటి సాఫ్ట్ కాపీలతో పాటు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, డిక్లరేషన్ ఫారమ్ సాఫ్ట్ కాపీలను PM-KISAN వెబ్‌సైట్‌లో సమర్పించాలి.

Pan Number : పాన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందా…అయితే జాగ్రత్త..

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. మూడు విడతల్లో(రూ.2వేలు) నగదుని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రతి ఏటా అర్హత గల రైతుల ఖాతాల్లో నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేల చొప్పున జమ చేస్తుంది.

పీఎం కిసాన్ వెబ్ సైట్ లో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి…
* pmkisan.gov.in వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాలి
* ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయాలి
* ఆ తర్వాత బెనిఫిషియరి స్టేటస్ పై క్లిక్ చేయాలి
* అక్కడ ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంట్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా స్టేటస్ తెలుస్తుంది
* ఈ ప్రొసీజర్ పూర్తి చేసిన తర్వాత లిస్టులో మీ పేరు కనిపిస్తుంది

PM KISAN via mobile App ద్వారా పేరు చెక్ చేసుకోవచ్చు..
* తొలుత పీఎం కిసాన్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
* యాప్ డౌన్ లోడ్ అయ్యాక డీటైల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇకపోతే, తాజాగా ఈ సాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అంటే రూ.6 వేలకు బదులుగా రూ.12 వేలు ఇవ్వనుంది. దీంతో ప్రతి విడతలో రైతులకు రూ.2 వేలకు బదులుగా రూ.4 వేలు జమకానున్నాయి. దీపావళి నాటికి కేంద్రం దీనిపై అధికారికంగా ప్రకటన చేయనుందని తెలుస్తోంది.