PM Modi : ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి .. మృతుల కుటుంబాలకు సానుభూతి
ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన రైళ్లు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో మాట్లాడానని..సహాయక చర్యలు కొనసాగుతున్నాయని..బాధితులకు కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

PM Modi.president draupadi murmu
PM Modi.president draupadi murmu : ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన రైళ్లు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో మాట్లాడానని..సహాయక చర్యలు కొనసాగుతున్నాయని..బాధితులకు కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదం గురించి తెలిసి షాక్ అయ్యానని తీవ్ర ఆవేదన చెందానని ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందిస్తు.. రైలు ప్రమాదంలో ఇంత మంది మరణించడం మనసును కలిచి వేసిందని ట్వీట్ చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు. ప్రమాదం జరిగిందని తెలిశాక తీవ్ర ఆవేదనకు లోనయ్యాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు.
Odisha Train Crash:వెల్లివిరిసిన మానవత్వం.. క్షతగాత్రుల కోసం రక్తదానం చేసేందుకు బారులు తీరిన ప్రజలు
దీనిపై హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతు..ప్రమాదం జరిగిన ప్రాంతంలో జాతీయ విపత్తు నిర్వహణ దళాలు(ఎన్డీఆర్‌ఎఫ్) చేరుకున్నాయని సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయని తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అలా ఈ ప్రమాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రమాద ఘటన బాధితులకు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ప్రమాదం సమాచారం తెలుసుకున్నాక షాక్ అయ్యానని గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.