పబ్లిక్ ఈవెంట్‌లో మాస్క్ వేసుకోవడానికి నో చెప్పిన మోడీ.. ప్రధానిని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా

పబ్లిక్ ఈవెంట్‌లో మాస్క్ వేసుకోవడానికి నో చెప్పిన మోడీ.. ప్రధానిని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సోషల్ మీడియా విమర్శలు ఎక్కువయ్యాయి. పబ్లిక్ ఈవెంట్ కు హాజరైన Modi.. మాస్క్ వేసుకోమని ఓ వ్యక్తి చెబుతుంటే దానికి అడ్డంగా చేయి ఊపుతూ నో చెప్పి అక్కడి నుంచి వెల్లిపోయారు. దీనిపై పలువురు సోషల్ మీడియా యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. COVID మహమ్మారి వ్యాప్తి ఉన్న సమయంలో ప్రధాని Modi ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ట్రోలింగ్‌కు దిగింది. ‘మాస్క్ వేసుకోండి. మోడీలా అవకండి’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియోలో ప్రధాని Modi  నడుచుకుంటూ.. స్టాల్స్‌లో ఉంచిన మాస్క్‌లు, హస్త కళా నైపుణ్యంతో కూడిన వస్తువులను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో వాలంటీర్ మాస్క్ వేసుకోమని పీఎం Modiని అడిగారు. దానికి పదేపదే నో చెప్పారు Modi. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో Modi పనికి విమర్శలు ధాటిగా వస్తున్నాయి.

ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆప్.. మాస్క్ ఉపయోగంపై అవగాహన క్రియేట్ చేయడంతో పాటు గతంలో మాస్క్ పెట్టుకోమని మోడీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జులైలో దేశం మొత్తానికి మాస్క్ వాడమని, రెండు అడుగుల సామాజిక దూరాన్ని పాటిస్తూ తరచూ చేతులు కడుక్కోమని చెప్పిన సంగతి మరోసారి ప్రస్తావిస్తున్నారు.