Modi-Channi : గురుగోవింద్‌ ఎక్కడ పుట్టారో తెలుసా..? చన్నీ “భాయియే” మాటకు మోడీ మార్క్ పంచ్

గురు రవిదాస్ పుట్టింది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో కాదా అంటూ..

Modi-Channi : గురుగోవింద్‌ ఎక్కడ పుట్టారో తెలుసా..? చన్నీ “భాయియే” మాటకు మోడీ మార్క్ పంచ్

Pm Modi

Modi-Channi : పంజాబ్ లో ఈ ఆదివారం జరగబోయే 2022 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ హీట్ పీక్స్ కు చేరింది. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫజికా పట్టణంలో బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్ తురుఫుముక్క ప్రియాంక గాంధీ వాద్రా, సీఎం చరణ్ జీత్ చన్నీ టార్గెట్ గా తనదైన శైలిలో వాడీ వేడి వాగ్బాణాలు వదిలారు.

ఇటీవల ప్రియాంక గాంధీ పాల్గొన్న ఓ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో చరణ్ జీత్ చన్నీ చేసిన విమర్శలు పంజాబ్ లో బర్నింట్ టాపిక్ అయ్యాయి. యూపీ, బిహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన వారి చేతుల్లో పంజాబ్ రాష్ట్రాన్ని పెట్టేది లేదని ఇటీవల చన్నీ అన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా పంజాబ్ కోడలు అని చెప్పారు చన్నీ.

Read This : Manmohan Singh: ఏడున్నరేళ్ల తర్వాత కూడా నెహ్రూని నిందిస్తారా? దేశం పరువు తీస్తున్నారు -మన్మోహన్ సింగ్

దీనికి పంజాబ్ ఫజీకా ఎన్నికల ప్రచారంలో కౌంటరిచ్చారు మోదీ. చన్నీ మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టింది వారి బాస్, ఢిల్లీకి చెందిన ప్రియాంక గాంధీ కాదా అని అన్నారు. “కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమన్నాడో దేశ ప్రజలంతా విన్నారు. ఢిల్లీకి చెందిన కుటుంబం ఆయన బాస్. అక్కడ ఆ మాటలు విని చప్పట్లు కొట్టింది కూడా ఆ కుటుంబానికి చెందిన ఆమే.” అని మోడీ కౌంటరిచ్చారు.

“పంజాబీలు అత్యధిక భక్తిభావంతో చూసే సిక్కు గురు.. గురు గోవింద్ సింగ్ పాట్నా సాహిబ్ లో పుట్టారు. ఆయన్ను పంజాబ్ నుంచి బయటకు పంపించగలరా? ఇలా జనాన్ని విభజించి పాలించాలనుకునేవాళ్లకు పంజాబ్ లో క్షణం కూడా ఉండే అర్హత లేదు” అని మోదీ ఫైరయ్యారు.

దళిత్ ఐకన్, గురు రవిదాస్ జయంతి సందర్భంగా పంజాబ్ మొత్తం ఆయన్ను స్మరించుకుందని.. నాయకులు ర్యాలీలు నిలిపేసి ఆలయాల్లో దర్శనాలు చేసుకొచ్చారని గుర్తుచేశారు మోదీ. గురు రవిదాస్ పుట్టింది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోనే కదా అని అన్నారు మోదీ. పంజాబ్ నుంచి, జనం మనసులోంచి సంత్ రవిదాస్ ను తొలగించడం మీకు సాధ్యమా? అని ప్రశ్నించారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అగ్రెసివ్ గా పంజాబ్ లో ప్రచారం చేస్తుండటంతో ఆయన టార్గెట్ గా చన్నీ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ ఐనట్టు విశ్లేషకులు చెబుతున్నారు. చన్నీ కామెంట్స్ విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కేజ్రీవాల్ కూడా బుధవారం ఫైరయ్యారు.

Read This : Arvind Kejriwal: ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతా: కేజ్రీవాల్ పై కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు

తన కామెంట్లు దుమారం రేపుతుండటంతో చన్నీ గురువారం ఫిబ్రవరి 17న వివరణ ఇచ్చారు. వలస వచ్చే కార్మికులను తాను ఏమీ అనలేదని.. పంజాబ్ అభివృద్ధిలో వారి పాత్ర చాలా గొప్పదన్నారు. మరోవైపు.. ఈ వివాదంపై ఇప్పటికే స్పందించిన ప్రియాంక గాంధీ వాద్రా.. పంజాబేతరులు పంజాబ్ ను పాలించకూడదన్నదే చన్నీ మాటల ఉద్దేశమని సమర్థించారు.

పంజాబ్ లో ఫిబ్రవరి 20, 2022న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు రానున్నాయి.