PM Modi : వ్యవసాయాన్ని అందరికీ ఉపయోగకరంగా చేయడంలో ఇక్రిశాట్ సక్సెస్ : ప్రధాని మోదీ

వసంతపంచమి రోజు స్వర్ణోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 25 ఏళ్ల లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇక్రిశాట్ ప్రత్యేక లక్ష్యాలతో ముందుకెళ్లాలన్నారు.

PM Modi : వ్యవసాయాన్ని అందరికీ ఉపయోగకరంగా చేయడంలో ఇక్రిశాట్ సక్సెస్ : ప్రధాని మోదీ

Pm Modi

ICRISAT Golden Jubilee : వ్యవసాయాన్ని అందరికీ ఉపయోగకరంగా చేయడంలో ఇక్రిశాట్ విజయం సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. వ్యవసాయ రంగానికి ఇక్రిశాట్ ఎంతో తోడ్పాటు అందిస్తోందని తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవసాయ విధానాన్ని ఎలా మార్చుకోవాలో మార్గాన్ని చూపిస్తోందన్నారు. ఈ సందర్భంగా మోదీ ఇక్రిశాట్ స్వర్ణోత్సవ శుభాకంక్షలు తెలిపారు. 50 ఏళ్లంటే ఒక సుధీర్గమైన కాలం అన్నారు. ఈ 50 ఏళ్లలో ఇక్రిశాట్ ఎన్నో ఆవిష్కరణలు చేసిందన్నారు. 50 ఏళ్లుగా మీరు చేస్తున్న పరిశోధనలకు అభిందనలు తెలిపారు.

ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు చేసుకుంటుంటే దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు చేసుకుంటోందన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ఇవాళ పీఎం మోదీ హాజరయ్యారు. ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్ ను పీఎం ఆవిష్కరించారు. రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్ మెంట్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఇక్రిశాట్ లో వివిధ పరిశోధనల కేంద్రాలను ప్రారంభించారు. ఇక్రిశాట్ లో కొత్త వంగడాలను పరిశీలించారు. ఇక్రిశాట్ లో ఫొటో గ్యాలరీలు, స్టాళ్లను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు.

PM Modi : ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

వసంతపంచమి రోజు స్వర్ణోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 25 ఏళ్ల లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇక్రిశాట్ కూడా ప్రత్యేక లక్ష్యాలతో ముందుకెళ్లాలని సూచించారు. మీ దగ్గర 50 ఏళ్ల అనుభవం ఉందన్నారు. నీరు, మట్టి మేనేజ్ మెంట్ పై అద్భుతమైన పరిశోధనలు చేశారని పేర్కొన్నారు. వ్యవసాయం రంగంలో అద్భుత ఆవిష్కరణలు చేశారని కొనియాడారు. వ్యవసాయాన్ని బలోపేతం చేయడంలో ఇక్రిశాట్ కృషి చాలా ఉందన్నారు. వాతావరణ మార్పులకు తట్టుకునే వంగడాలు సృష్టించాలన్నారు.

పరిశోధన, ఆవిష్కరణల్లో ఇక్రిశాట్ చాలా ముందంజలో ఉందన్నారు. దేశంలో 80 శాతం మంది సన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. వాతావరణ మార్పులు చిన్న రైతులకు ఇబ్బందిగా మారాయని అన్నారు. వాతావారణ సవాళ్లను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వాతావరణ మార్పులకనుగుణంగా వ్యవసాయంలో మార్పులు రావాలన్నారు. వాతావరణ మార్పులపై ఫోకస్ చేయాలని ప్రపంచాన్ని కోరామని తెలిపారు.

US Police Arrest Hen : కోడిని అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు..!!

నదుల అనుసంధానం ద్వారా నీటి వనరుల్ని పెంచుతామని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీతో రైతులకు తోడ్పాటు ఇస్తామని చెప్పారు. డిజిటల్ వ్యవసాయం దేశ ముఖ చిత్రాన్ని మారుస్తోందన్నారు. భూమి పత్రాల నుంచి సాగు వరకు డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానం చేస్తామని చెప్పారు. పంట నిల్వ వసతుల్ని మరింత పెంచుతున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో ఆహార ఉత్పత్తుల మిగులు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. మైక్రో ఇరిగేషన్ మరింత ప్రోత్సహించాలన్నారు.

అంతకముందు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌‌కు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎస్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. 2గంటల 10 నిమిషాలకు శంషాబాద్‌లో ప్రధాని ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు మోదీ వెళ్లారు.