ఇస్రోలో మోడీ అడుగుపెట్టగానే…సైంటిస్టులకు దురదృష్టం

  • Published By: venkaiahnaidu ,Published On : September 13, 2019 / 04:25 AM IST
ఇస్రోలో మోడీ అడుగుపెట్టగానే…సైంటిస్టులకు దురదృష్టం

ప్రధాని మోడీపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఫైర్ అయ్యారు. శాస్త్రవేత్తలు 10-12 ఏళ్లు చంద్రయాన్-2 కోసం చాలా కష్టపడితే ప్రధాని మోడీ మాత్రం తానే స్వయంగా చంద్రయాన్-2ల్యాండింగ్ చేస్తున్నాను అని ఫోజ్ కొట్టడానికే బెంగళూరుకి వచ్చాడని అన్నారు. కేవలం ప్రచారం కోసమే మోడీ బెంగళూరుకి వచ్చాడన్నారు.

మోడీ ఇస్రో సెంటర్ లో కాలు పెట్టగానే ఇస్రో శాస్త్రవేత్తలకు దురదృష్టం పట్టిందని ఆయన అన్నారు. చంద్రయాన్-2 ల్యాండింగ్ ను లైవ్ లో వీక్షించేందుకు ఈ నెల 7న ప్రధాని మోడీ బెంగళూరు ఇస్రో సెంటర్ కి వెళ్లిన విషయం తెలిసిందే. 

చంద్రయాన్-2 ప్రాజెక్ట్ ని ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. చంద్రమామ పైకి విక్రమ్ ల్యాండర్ ని పంపింది. అంతా సజావుగానే సాగింది. కాసేపట్లో విక్రమ్ ల్యాండర్ దిగాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో చుక్కెదురైంది. విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలం మీద సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సిన విక్రమ్ ల్యాండర్ 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో ఆచూకీ గల్లంతైంది. 36 గంటల చంద్రుడి ఉపరితలం మీద విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అయినట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. అప్పటి నుంచి ల్యాండర్ తో అనుసంధానం కావడానికి ఇస్రో శాస్త్రవేత్తలు  ప్రయత్నాలు చేస్తున్నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. నిరంతరాయంగా సంకేతాలను పంపించినప్పటికీ.. ల్యాండర్ వాటిని గ్రహించడం లేదు. ఇప్పుడు నాసా శాస్త్రవేత్తలు కూడా రంగంలోకి దిగారు.