PM Modi: మెట్రో రైలు టిక్కెట్ కొని పిల్లలతో కలిసి ప్రయాణించిన మోదీ.. వీడియో విడుదల

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు.

PM Modi: మెట్రో రైలు టిక్కెట్ కొని పిల్లలతో కలిసి ప్రయాణించిన మోదీ.. వీడియో విడుదల

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్ర, నాగ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాగ్‌పూర్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్ పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని ప్రారంభించారు. ఇది దేశంలో అందుబాటులోకి వచ్చిన ఆరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. దీనితోపాటు రెండు మెట్రో రైళ్లను ప్రారంభించారు.

Twitter: రేపే ‘ట్విట్టర్ బ్లూ’ రీలాంఛ్.. ఐఫోన్లకు ఎక్కువ ఛార్జీ వసూలు

ఈ సందర్భంగా మెట్రో రైలు టిక్కెట్ కొనుక్కుని, కొంతమంది పిల్లలతో కలిసి ప్రయాణించారు. నాగ్‌పూర్‌లో ఆదివారం నాగ్‌పూర్‌లోని ఫ్రీడమ్ పార్క్ నుంచి ఖాప్రి వరకు ఏర్పాటైన మెట్రో ఫేజ్-1 ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ రెండు మెట్రో రైళ్లను ప్రారంభించారు. అనంతరం ఈ రైళ్లను జాతికి అంకితం చేశారు. తర్వాత మెట్రో ఫేజ్-2కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖాప్రి నుంచి ఆటోమోటివ్ స్క్వేర్ వరకు ప్రయాణించే ఒక రైలును, ప్రజాపతి నగర్ నుంచి లోకమాన్య నగర్ వరకు వెళ్లే మరో రైలును ప్రధాని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మెట్రో స్టేషన్లో టిక్కెట్ కొనుక్కున్న ప్రధాని, కొంతమంది విద్యార్థులతో కలిసి రైలులో ప్రయాణించారు. విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పాల్గొన్నారు.