PM Modi Meeting on Covid: ముగిసిన హైలెవెల్ మీటింగ్.. కొవిడ్19పై ప్రధాని మోదీ కీలక సూచనలు

ప్రధాని సూచనలతో మాస్కులు తప్పనిసరిగా వినియోగించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్ సహా మరికొన్ని ఆసుపత్రుల్లో మాస్క్ తప్పనిసరి చేశారు. ఈ విషయమై అటు రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ విషయమై ఆయా రాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహించారు.

PM Modi Meeting on Covid: ముగిసిన హైలెవెల్ మీటింగ్.. కొవిడ్19పై ప్రధాని మోదీ కీలక సూచనలు

PM Modi chairs review meeting on Covid

PM Modi Meeting on Covid: కొవిడ్ కలకలం మరోసారి కుదిపివేస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర ప్రభుత్వ పెద్దలు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్‭లతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కొన్ని కీలక సూచనలు చేశారు.

Supreme Court: పెద్ద నోట్లరద్దుపై 50కి పైగా పిటిషన్లు.. జనవరి 2న తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు

మోదీ చేసిన సూచనలు:
జనసమర్థ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలి.
ఎయిర్‌పోర్టుల వద్ద అప్రమత్తత పెంచాలి.
వృద్ధులు, వయసులో పెద్దవారు ప్రికాషనరీ డోస్ తీసుకునేలా మరిన్ని చర్యలు తీసుకోవాలి.
ఆసుపత్రుల్లో బెడ్స్‌తో పాటు వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల సంఖ్యను పెంచాలి.
తగినంత సంఖ్యలో వైద్య సిబ్బంది ఉండేలా చూడాలి.
జీనోమ్ సీక్వెన్సింగ్‌తో పాటు టెస్టులపై శ్రద్ధ పెంచాలి.

ప్రధాని సూచనలతో మాస్కులు తప్పనిసరిగా వినియోగించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్ సహా మరికొన్ని ఆసుపత్రుల్లో మాస్క్ తప్పనిసరి చేశారు. ఈ విషయమై అటు రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ విషయమై ఆయా రాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహించారు.

Maha vs Karnataka: సంజయ్ రౌత్ చైనా ఏజెంట్.. రౌత్ ‘చైనా తరహా’ వ్యాఖ్యలపై భగ్గుమన్న కర్ణాటక సీఎం