మోడీ ఆస్తుల పూర్తి వివరాలు.. తన సంపద ఎక్కడెక్కడ పెట్టుబడిగా పెట్టారో తెలుసా?

10TV Telugu News

where modi invested his personal wealth గతేడాదితో పోల్చుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపాదన కొంత పెరిగింది. జూన్-30,2020 నాటికి మోడీ సంపాదన రూ.2.85 కోట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే రూ.36 లక్షలు మోడీ సంపాదన పెరిగింది. 2019లో మోడీ సంపాదన రూ.2.49 కోట్లు. ప్రధాని కార్యాలయానికి ఇటీవల సమర్పించిన నివేదికలో తనకు సంబంధించిన ఆస్తుల వివరాలను మోడీ పొందుపరిచారు.ఎలాంటి లోన్ లేదు

జూన్‌ నెల ముగిసేనాటికి ప్రధాని మోడీ దగ్గర రూ. 31,450 నగదు ఉండగా, ఎస్బీఐ గాంధీనగర్‌ ఎన్‌ఎస్‌సీ శాఖకు చెందిన ఆయన బ్యాంకు ఖాతాలో 3,38,173 రూపాయలు ఉన్నాయి. 2019లో ఆయన సేవింగ్స్ అకౌంట్ లో కేవలం రూ.4,143 మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఆయన సేవింగ్స్ అకౌంట్ బాలెన్స్ పెరిగింది.అదే బ్రాంచ్‌లో ఓ ఫిక్స్ డ్ డిపాజిట్‌ కూడా ఉంది. మల్టీ ఆప్షన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో రూ. 1,60,28,039 నిల్వ ఉంది.   2019లో ఆయన FD విలువ రూ.1,27,81,574గా ఉండింది.

బంగారం, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి
మోడీ దగ్గర నాలుగు గోల్డ్ రింగ్స్ ఉన్నాయి. వాటి బరువు 45 గ్రాములు, విలువ సుమారు రూ. 1.51,875. గాంధీన‌గ‌ర్ లోని సెక్టార్-1లో 3,531 స్క్వేర్ ఫీట్‌‌ల సొంత ప్లాట్ మోడీకి ఉంది. ఈ ప్లాట్‌‌ కి మోడీతో సహా మొత్తం నలుగురు జాయింట్ ఓనర్స్‌‌ ఉన్నారు. ఈ ప్లాట్‌‌ లో మోడీకి 25 శాతం షేర్ వస్తుంది. మోడీ దగ్గర మూవబుల్ అసెట్స్(కదిలే ఆస్తులు)విలువ 1.75కోట్లకు పైగా ఉంది.సొంత వాహనం
మోడీ దగ్గర సొంత కారు కానీ,బైక్ కానీ లేదు.

మోడీ ట్యాక్స్ సేవింగ్ టూల్స్

జీవిత బీమా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (ఎన్‌ఎస్‌సి) మరియు మౌలిక సదుపాయాల బాండ్‌లు మోడీకి అనుకూలమైన పన్ను ఆదా సాధనాలు. రూ.8,43,124 విలువైన జాతీయ పొదుపు ధృవపత్రాలతో పన్నులను మోడీ సేవ్ చేశారు. రూ.1,50,975 విలువైన లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఉంది. 2012 జనవరిలో రూ.20,000లతో ఎల్ అండ్ టీ ఇన్ఫ్రా స్ట్రక్చర్ బాండ్ ను మోడీ కొనుగోలు చేయగా..ఆ బాండ్ ఇంకా మెచ్యూరిటీ కాలేదు.

10TV Telugu News