Corona Vaccine: విగ్రహాలకు,కొత్త పార్లమెంట్ కు 20వేల కోట్లు..ఉచిత వ్యాక్సిన్ కోసం 3వేల కోట్లు కేటాయించలేరా?

a కేంద్ర ప్రభుత్వంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Corona Vaccine: విగ్రహాలకు,కొత్త పార్లమెంట్ కు 20వేల కోట్లు..ఉచిత వ్యాక్సిన్ కోసం 3వేల కోట్లు కేటాయించలేరా?

Pm Modi Did Not Respond To My Letter Over Free Covid 19 Vaccination Alleges Mamata

Mamata కేంద్ర ప్రభుత్వంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఉచిత కోవిడ్-19 వ్యాక్సినేషన్ పై బుధవారం ప్రధానమంత్రి తాను రాసిన లేఖపై ఇప్పటివరకు తనకు ఎటువంటి రిఫ్లై రాలేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. కొత్త పార్లమెంట్ మరియు విగ్రహాల నిర్మాణానికి 20వేల కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రం..ఉచిత వ్యాక్సిన్ల కోసం 3వేల కోట్ల రూపాయలను ఎందుకు కేటాయించట్లేదని మమత ప్రశ్నించారు. పీఎం కేర్స్ ఫండ్ ఏమైందని ప్రశ్నించారు. యువకుల ప్రాణాలను..కేంద్రం ఎందుకు ప్రమాదంలో పెడుతుందో తెలియట్లేదన్నారు. ప్రాంతాల్లో పర్యటించడం మాని బీజేపీ నేతలు కోవిడ్-19 హాస్పిటల్స్ ను సందర్శించాలన్నారు. బీజేపీ నేతలు బెంగాల్ కు వచ్చి కోవిడ్-19ను వ్యాప్తి చేస్తున్నారని మమత ఆరోపించారు.

గురువారం కోల్ కతాలో మమత మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు బీజేపీ నేతలు కారణమని మమత ఆరోపించారు. బీజేపీ నేతలు బెంగాల్ కు మళ్లీ మళ్లీ వచ్చి కోవిడ్-19ను వ్యాప్తి చేస్తున్నారని మమత ఆరోపించారు. రాష్ట్రంలోకి రావాలంటే కేంద్రమంత్రులైనా.ఇతర రాజకీయ నేతలైనా సరే నెగిటివ్ ఆర్టీ-పీసీఆర్ కోవిడ్-19 టెస్ట్ రిపోర్టులు తమతో తీసుకురావాల్సి ఉంటుందని మమత సృష్టం చేశారు. లేకుంటే రాష్ట్రంలోకి అనుమతించబోమన్నారు. సామాన్యులకైనా,మంత్రులకైనా రూల్ అందరికీ ఒకటే అని మమత సృష్టం చేశారు. బెంగాల్ లో హింసను కేంద్ర నాయకులు ప్రోత్సహిస్తున్నారని మమత తెలిపారు.

తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 24గంటలైనా గడవలేదని,అప్పుడే తనకు బీజేపీ నేతల నుంచి లేఖలు వస్తున్నాయని,కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చిందని,పెద్ద ఎత్తున బీజేపీ నేతలు రాష్ట్రానికి వస్తున్నారని మమత తెలిపారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో విస్తృతంగా తిరుగుతూ అసాధారణ పరిస్థితులకు ప్రజలను రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రజా తీర్పును భారతీయ జనతా పార్టీ నేతలు అంగీకరించడం లేదని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దయచేసి ప్రజా తీర్పును గౌరవించాలని తాను బీజేపీ నేతలకు విజ్ణప్తి చేస్తున్నానని మమతాబెనర్జీ అన్నారు.

కాగా, ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌ల ఫలితాలు వెలువడిన అనంత‌రం చోటుచేసుకున్న హింసాకాండ‌పై వాస్త‌వాలు నిగ్గుతేల్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన న‌లుగురు స‌భ్యుల‌తో కూడిన నిజ నిర్ధార‌ణ బృందం గురువారం ఉదయం రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. హోం మంత్రిత్వ శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి సారథ్యంలో ఈ ప్ర‌తినిధి బృందం… బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం వివిధ ప్రాంతాల్లో జ‌రిగిన హింసాకాండ‌కు దారితీసిన ప‌రిస్థితుల‌ను అథ్య‌య‌నం చేయ‌డంతో పాటు క్షేత్ర‌స్ధాయి ప‌రిస్థితిని మ‌దింపు చేయ‌నుంది.