PM Modi : కరోనా పరిస్థితులపై సీఎంలతో చర్చించిన ప్రధాని మోడీ

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోడీ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు.

PM Modi : కరోనా పరిస్థితులపై సీఎంలతో చర్చించిన ప్రధాని మోడీ

Pm Modi Discusses On Corona Conditions With Cms

PM Modi discusses on corona conditions : దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోడీ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, తమిళనాడు సీఎం ఎంకె.స్టాలిన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరాం ఠాకూర్ తో మాట్లాడారు.

నాలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ రోగులకు అందించడానికి ఆక్సిజన్ తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.

ఆస్పత్రుల్లో పడకల కొరత, వ్యాక్సినేషన్ కు సంబంధించి చర్చ జరిగినట్లు హిమాచల్ సీఎం జయరాం ఠాకూర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత మూడు రోజుల్లో ప్రధాని మోడీ 10 మంది సీఎంలు, ఇద్దరు ఎల్ జీలతో మాట్లాడారు.

మహారాష్ట్రలో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక యాప్ రూపొందించాలని ఉద్దవ్ ఇదివరకే కోరారు. కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ కు సంబంధించి సమస్యలు తలెత్తడంతో మహారాష్ట్ర ప్రత్యేక యాప్ కోరుతోంది.

మధ్యప్రదేశ్ లో పాజిటివి రేట్ క్రమంగా తగ్గుతోందని, రికవరీ రేటు పెరుగుతున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని దృష్టికి తెచ్చారు. అవసరమైన సాయం అందిస్తామని ప్రధాని మోడీ చెప్పినట్లు సీఎం ట్విట్టర్ లో వెల్లడించారు.