అది మహాకూటమి కాదు మహా కల్తీ కూటమి : ప్రధాని మోడీ ఫైర్

అది మహాకూటమి కాదు మహా కల్తీ కూటమి : ప్రధాని మోడీ ఫైర్

ఢిల్లీ: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాన్ని కార్నర్ చేశారు. బడ్జెట్

అది మహాకూటమి కాదు మహా కల్తీ కూటమి : ప్రధాని మోడీ ఫైర్

ఢిల్లీ: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాన్ని కార్నర్ చేశారు. బడ్జెట్

ఢిల్లీ: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాన్ని కార్నర్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్డీయే పాలనలోని ఘనతలు చెబుతూనే కాంగ్రెస్  పార్టీపై విమర్శలు చేశారు. 55ఏళ్ల కాంగ్రెస్ పాలనతో 55నెలల తమ పాలనను పోల్చి చూడాలని మోడీ కోరారు. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లలో అధికారం కోసం అర్రులుచాస్తే తాము 55 నెలలూ దేశం  కోసమే పనిచేశామని చెప్పారు. కాంగ్రెస్ 55ఏళ్ల పాలనలో స్వచ్ఛత 38శాతమైతే తమ పాలనతో 55నెలల్లోనే దాన్ని 98శాతానికి చేర్చామని మోడీ తెలిపారు. 55ఏళ్ల పాలనలో కాంగ్రెస్ 12కోట్ల  గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తే మేం 55నెలల్లోనే 13కోట్ల కనెక్షన్లు అందించామన్నారు.

 

దేశంలో వ్యవస్థల నాశనానికి కారణం కాంగ్రెస్ అని మోడీ అన్నారు. యూపీఏ హయాంలో ఫోన్ బ్యాంకింగ్ విధానాన్ని నాటి పాలకులు తమ సన్నిహితులకు అనుకూలంగా వాడుకున్నారని  విమర్శించిన మోడీ.. మన బ్యాంకింగ్ వ్యవస్థ అనేక సమస్యలను ఎదుర్కొందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే ఆత్మహత్య చేసుకోవడం లాంటిదే అని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్  వ్యాఖ్యలను ప్రధాని ఉటంకించారు. మన సైన్యం, ఎయిర్‌ఫోర్స్ బలంగా మారడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్న మోడీ.. రాఫెల్ డీల్ అంశాన్ని ప్రస్తావించారు. ఎవరి కోసం, ఏ కంపెనీ ప్రయోజనాల కోసం  రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. పార్లమెంట్‌లోనైనా, బయటైనా.. ఇంటా బయటా మేం నిజాలే మాట్లాడతాం.. వినే ధైర్యం మీకు లేదని మోడీ  విపక్షాలను విమర్శించారు. ధరల పెరుగుదలకు, కాంగ్రెస్‌కు అవినాభావ సంబంధం ఉందన్నారు.

 

కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయంగా దేశ కీర్తిప్రతిష్ఠలను మంటగలుపుతోందని మోడీ మండిపడ్డారు.కాంగ్రెస్ నేతలు రెండు కాలాలను చూస్తున్నారన్న మోడీ.. వాటిలో ఒకటి బీసీ అని, అంటే బిఫోర్  కాంగ్రెస్ అని, అప్పట్లో ఏమీ జరగలేదని, మరొకటి ఏ.డీ. అని అంటే ఆఫ్టర్ డైనాస్టీ అని, కాంగ్రెస్ ప్రభుత్వాలు లేనపుడు అన్నీ జరుగుతున్నాయని చెప్పారు. ఆరోగ్యకరమైన పోటీకి సిద్ధంగా  ఉండాలని ప్రతిపక్షాలను మోడీ కోరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆరోగ్యకరమైన పోటీ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్న యువతకు  ప్రధాని స్వాగతం పలికారు.

 

పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఉంటే ఏమేం చేయగలదో దేశ ప్రజలు చూశారని మోడీ అన్నారు. మహాకూటమిపైనా మోడీ విమర్శలు చేశారు. కోల్‌కతా వేదికగా కలిసిన పార్టీలది మహాకూటమి  కాదు అది మహాకల్తీ కూటమి అని వర్ణించారు. ప్రజలు దాన్ని కోరుకోవడం లేదని చెప్పారు.

×