NIZAM gold coin : ప్రపంచంలోనే అతిపెద్ద ‘నిజాం గోల్డ్ కాయిన్’ ఆచూకీ కోసం మోడీ సర్కార్ యత్నాలు

ది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నాణెం..ఎంత పెద్దది అంటే..అది 12 కేజీల బంగారు నాణెం.అది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎవరి చేతుల్లో ఉంది? 40 ఏళ్లుగా కొనసాగుతున్న మిస్టరీ వీడేనా? చరిత్రకారులంతా ఈ బంగారు నాణెం గుట్టు విప్పేందుకు శతవిధాలా యత్నించారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఈ క్రమంలో అలాంటి నిధిని వెతికి పట్టుకోవాలని మోడీ సర్కార్‌ నిర్ణయించింది.

NIZAM gold coin : ప్రపంచంలోనే అతిపెద్ద ‘నిజాం గోల్డ్ కాయిన్’ ఆచూకీ కోసం మోడీ సర్కార్ యత్నాలు

The Largest Nizam Gold Coin In The World (1)

The largest NIZAM gold coin in the world : అది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నాణెం..ఎంత పెద్దది అంటే..అది 12 కేజీల బంగారు నాణెం.అది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎవరి చేతుల్లో ఉంది? 40 ఏళ్లుగా కొనసాగుతున్న మిస్టరీ వీడేనా? చరిత్రకారులంతా ఈ బంగారు నాణెం గుట్టు విప్పేందుకు శతవిధాలా యత్నించారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఈ క్రమంలో అలాంటి నిధిని వెతికి పట్టుకోవాలని మోడీ సర్కార్‌ నిర్ణయించింది.

ఒకటి కాదు.. రెండు కాదు.. 40 ఏళ్లుగా అదే మిస్టరీ. ఎవరికీ తెలియని గుట్టు. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నాణెం. 12 కిలోల బరువుతో.. విలువ కట్టలేని సంపద. కానీ.. ఎక్కడుందో తెలియదు? ఎవరి దోచుకున్నారో.. ఎక్కడ దాచుకున్నారో అర్థం కాదు. చరిత్రకారులంతా ఈ గుట్టు విప్పేందుకు ప్రయత్నించి అలసిపోయారు. సీబీఐ అధికారులు కూడా ఏళ్ల తరబడి ఇన్వెస్టిగేషన్‌ తర్వాత ఫైలు పక్కనపెట్టారు. మా వల్ల కాదంటూ చేతులెత్తేశారు. అలాంటి నిధిని వెతికి పట్టుకోవాలని మోడీ సర్కార్‌ నిర్ణయించింది. ఆ నాణెం ఎవరి చేతుల్లో ఉందో.. ఏ దేశంలో ఉందో తెల్సుకోవాలని పట్టుదలగా ఉంది. దాన్ని చేజిక్కించుకోవాలని ఆరాట పడుతోంది. మరోసారి వెతుకులాట మొదలుపెట్టింది.

also read : Black Diamond: వేలానికి అత్యంత అరుదైన “నల్ల వజ్రం”

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన నిజాం ప్రభువుదే ఆ బంగారు నాణెం. ఆయన దాచిన నిధిలో అత్యంత విలువైంది. మొదటి నిజాం నుంచి వారసత్వంగా.. ఆ సంస్థానంలో చివరి ప్రభువైన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ చెంతకు చేరింది. ఆ తర్వాత భారత్‌ యూనియన్‌లో హైదరాబాద్‌ సంస్థానం విలీనమయ్యాక.. ఈ నాణెం ఎవరి చేతుల్లోకి వెళ్లిందో.. ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అయితే నిజాం వారసుడైన ముకరంజా 40 ఏళ్ల క్రితం ఈ నాణాన్ని స్విస్‌ బ్యాంక్‌లో వేలం వేయడానికి ప్రయత్నించినట్లు ఆధారాలున్నాయి. కానీ.. అందులో ఎంత వరకు నిజముందో తెలియదు. ఈ కాయిన్‌ను స్విస్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసిందో, లేదో చెప్పేవారు లేరు. అప్పట్లో ఈ నాణాన్ని ముకరంజా దేశం దాటించినా.. ఆ విషయాన్ని సీబీఐ పసిగట్టలేకపోయిందన్న విమర్శలున్నాయి.

1700వ శతాబ్దంలో జహంగీర్‌ చక్రవర్తి రెండు బంగారు నాణాల్ని తయారు చేయించారు. అవి ఒక్కోటి 12 కేజీలు ఉండేవి. అప్పట్లోనే వీటి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ కాయిన్స్‌పై పర్షియన్‌ భాషను ముద్రించారు. అందులో ఒకదాన్ని ఇరాన్‌ అంబాసిడర్‌ యాద్గార్‌ అలీకి బహుమతిగా ఇచ్చారు. ఔరంగజేబు హయాంలో రెండో నాణాన్ని ఘజియుద్దీన్‌ ఖాన్‌ ఫిరోజ్‌ జంగ్‌కు ప్రజెంట్‌ చేశారు. తన సైన్యాన్ని కాపాడినందుకు కృతజ్ఞతగా అందజేశారు. ఘజియుద్దీన్‌ నుంచి ఆయన కుమారుడైన మొదటి నిజాం చెంతకు చేరింది ఈ నాణెం. ఆ తర్వాత వారసత్వంగా చివరి నిజాం చేతుల్లోకి వెళ్లింది. ఆయన భారత ప్రభుత్వానికి లొంగిపోయాక.. ఈ కాయిన్‌ ఏమైందో తెలియదు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దది అని.. దాని విలువను అంచనా వేయడం కష్టమేనని చరిత్రకారులు అంటున్నారు. అది ఎక్కడ ఉందో తెల్సుకోవడానికి గతంలో చాలామంది చరిత్రకారులు ప్రయత్నించినప్పటికీ.. చిన్న సమాచారం కూడా దొరకలేదు. ఇప్పుడు దాదాపు 40 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం మరోసారి వేట ప్రారంభించింది.

also read : వావ్..ఏమి అందం : పింక్ డైమండ్ ధర రూ. 198 కోట్లు..!!

1987 తర్వాత ఈ నాణెం గురించి ఎలాంటి రిపోర్టులు లేవు. 1987 నవంబర్‌ 9న జెనీవాలోని ఓ హోటల్‌లో ఈ కాయిన్‌ను వేలం వేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన యూరప్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు.. సీబీఐకి ఉప్పందించాయి. ఆ తర్వాత చాలాకాలం పాటు సీబీఐ అధికారులు రకరకాల కోణాల్లో దర్యాప్తు చేసినా ఫలితం శూన్యం. అప్పట్లో ఈ కేసును డీల్‌ చేసినా చాలామంది ఆఫీసర్లు ఇప్పుడు లేరు. దాంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.

తండ్రి నుంచి 12 కేజీల బంగారు నాణాన్ని విదేశాలకు తీసుకెళ్లిన ముకరంజా.. దాన్ని జెనీవాలో వేలానికి పెట్టాడు. 1987లోనే ఆ కాయిన్‌ విలువ 125 కోట్లు కాగా.. 70 కోట్లకు బేరం పెట్టినట్లు తెలుస్తోంది. కానీ.. అంత భారీ మొత్తం పెట్టి ఎవరైనా కొనుగోలు చేశారా.. లేక ముకరంజా దగ్గరే ఉందా అన్నది తేలాల్సి ఉంది. అయితే జహంగీర్‌ ముద్రించిన రెండు బంగారు నాణాలూ ముకరంజా దగ్గరే ఉన్నాయని.. వాటిని వేలం వేసేందుకు ప్రయత్నించినట్లు కొంతమంది చరిత్రకారులు చెప్తుంటారు. మరి.. 35 ఏళ్ల తర్వాత మళ్లీ గతాన్ని తవ్వి తీస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఈసారైనా గుట్టు విప్పుతుందో, లేదో చూడాలి.

also read : The Sakura Pink Diamond: రూ.213 కోట్ల డైమండ్.. వేలంలో దక్కించుకున్న వ్యాపారి!