PM Modi : వేగం తగ్గిఉండొచ్చు కానీ సంకల్పం అలాగే ఉంది

రికార్డు సమయంలో దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.

PM Modi : వేగం తగ్గిఉండొచ్చు కానీ సంకల్పం అలాగే ఉంది

Pm Modi

PM Modi రికార్డు సమయంలో దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. శుక్రవారం.. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్​ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సొసైటీ(CSIR) సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని మోడీ..విపత్కర పరిస్థితుల్లో అద్భుతమైన పనితీరు కనబర్చినందుకు డాక్టర్లు,మెడికల్ సిబ్బంది,శాస్త్రవేత్తలు,కరోనా వారియర్లకు కృతజ్ణతలు తెలిపారు. అనేక మంది ప్రాణాలు కాపాడిన వారికి దేశం నిరంతరం కృతజ్ఞతలు తెలుపుతుందని అన్నారు.

ఇతర దేశాల్లో నూతన ఆవిష్కరణల కోసం భారత్ ఎదురు​ చూసే రోజులు పోయాయని ప్రధాని అన్నారు. ఇప్పుడు భారత్ అగ్ర దేశాలతో పాటు​ ఆవిష్కరణలలో వేగంగా దూసుకుపోతోందన్నారు. కేవలం ఏడాది లోపే మన శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఈ సందర్భంగా మరోసారి…ఆత్మనిర్భర్ భారత్, స్ట్రాంగ్ ఇండియా పిలుపును మోడీ పునరుద్ఘాటించారు. COVID-19 సంక్షోభం దాని వేగాన్ని తగ్గించి ఉండవచ్చు, కాని మన సంకల్పం అలాగే ఉంది అని ప్రధాని అన్నారు.

వ్యవసాయం నుంచి ఆస్ట్రానమీ వరుకు,విపత్తు నిర్వహణ నుంచి రక్షణ టెక్నాలజీ వరకు,వ్యాక్సిన్ నుంచి వర్చువల్ రియాలిటీ వరకు,బయోటెక్నాలజీ నుంచి బ్యాటరీ టెక్నాలజీ వరకు అనేక రంగాల్లో వివిధ రంగాల్లో భారత్..స్వయం సమృద్ధిగా ఉండాలనుకుంటోందన్నారు. సుస్థిర అభివృద్ధి మరియు క్లీన్ ఎనర్జీలో ఇతర దేశాలకు భారత్ మార్గం చూపుతోందన్నారు. అంతేకాకుండా శాటిలైట్ సాఫ్ట్ వేర్ రంగాల్లో తన పాత్రతో ఇతర దేశాల పురోగతిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రధాని.