కరోనాను గొప్పగా ఎదుర్కొన్నాం.. ఎన్నికల ఫలితాలే రుజువు

  • Published By: madhu ,Published On : November 11, 2020 / 08:04 PM IST
కరోనాను గొప్పగా ఎదుర్కొన్నాం.. ఎన్నికల ఫలితాలే రుజువు

PM Modi Hails NDA Wins In Bihar : భారతదేశంలో ప్రబలిన కరోనాను తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, తమ ప్రభుత్వంపై ప్రజల నమ్మకొ పెరిగిందని అందుకే ఎన్నికల్లో గెలిచామన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అలాగే..సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్ కూడా కారణమన్నారు. పార్టీని గెలిపించినందుకు భారత దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. అపారమైన ప్రేమను వ్యక్తపరిచినందుకు, బీహార్ ప్రజల మేలు కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. 2020, నవంబర్ 11వ తేదీ బుధవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ…



మహిళల మేలు కోసం బీజేపీ ప్రభుత్వం ఎంతో పని చేస్తుందని, మహిళల జీవితాలను మార్చేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. శాంతిగా ఎన్నికలు జరగడం పట్ల ప్రతొక్కరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. తొలుత ఎన్నికలు జరిగితే..బూత్ లో రిగ్గింగ్, మళ్లీ ఎన్నికలు జరగడం లాంటివి చూశామన్నారు. బీహార్ లో ఎన్నికలంటే..ఇలాంటి వార్తలు వచ్చేవన్నారు. కానీ..ఈసారి జరిగిన ఎన్నికల్లో అలాంటివి కనిపించలేదని, ఇదే దేశం యొక్క శక్తి అన్నారు.



కరోనా కాలంలో..ఎన్నికలు నిర్వహించడం కష్టసాధ్యమని, అయితే..అందరి కృషి కారణంగానే..ఎన్నికలు సజావుగా జరిగాయన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలకు ఎన్ని అభినందనలు తెలియచేసినా..తక్కువేనన్నారు. జేపీ నడ్డా..చేసిన వ్యూహాలు, ఆయన చేసిన కృషి కారణంగానే..ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిందన్నారు. ఇందుకు చప్పట్లతో అభినందించారు. నడ్డా జీ..ఆగే భడో అంటూ కార్యకర్తలతో అనిపించారు.



రెండు సీట్లు, రెండు గదుల్లో పార్టీని నడిపించే బీజేపీ..ఇప్పుడు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తోందన్నారు. ప్రతిసారి దేశ ప్రజలు స్పష్టమైన తీర్పును ఇస్తున్నారని, దేశం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న వారికి పట్టం కడుతున్నారని వెల్లడించారు. పనిచేస్తుంటే..ప్రజల ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని, 24 గంటల పాటు..దేశం కోసం ఆలోచిస్తుంటే..ఫలితాలు అనుకూలంగా వస్తాయన్నారు. దేశ ప్రజలు అన్ని చూస్తున్నారని, బ్యాంకు ఖాతాలు, గ్యాస్ కనెక్షన్, మంచి రోడ్లు, రైల్వే స్టేషన్ ఇతరత్రా హామీలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.



దేశం కోసం, ప్రజల అభివృద్ది చెందాలని బీజేపీ, ఎన్డీయే ఆలోచిస్తోందన్నారు. సమాజంలో ఉన్న అన్నీ వర్గాల మేలు కోసం ఒక్క బీజేపీ మాత్రమే ఆలోచిస్తూ..పనిచేస్తుందన్నారు. దేశంలో ఉన్న యువత బీజేపీపై భరోసా పెట్టుకుందని, దేశంలోని మధ్యతరగతి ప్రజల కలలు సాకారం చేసేది ఒక్క బీజేపీ పార్టీయేనని స్పష్టం చేశారు. మహిళల గౌరవం పెంపొందించేందుకు, వారి మేలు కోసం కృషి చేసేది, అలాగే..రైతులు, కార్మికుల కోసం ఆలోచించింది తమ పార్టీ ఒక్కటేనన్నారు.



బీహార్ లో సీట్లను ఎక్కువ కైవసం చేసుకుందని, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి అవకాశం ఇస్తున్నారని వెల్లడించారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసిందని చెప్పుకొచ్చారు. జనతా కర్ఫ్యూ నుంచి మొదలుకుని ఇప్పటి వరకు పలు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ప్రధాని మోడీ.