PM Modi: అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు మోదీ కానుక.. చాదర్ సమర్పించిన ప్రధాని

ప్రతి ఏటా జరిగే దర్గా ఉర్సు ఉత్సవాలకు చాదర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా దర్గా నిర్వాహకులకు మోదీ చాదర్ అందించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొన్నారు.

PM Modi: అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు మోదీ కానుక.. చాదర్ సమర్పించిన ప్రధాని

PM Modi: రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ప్రధాని మోదీ కానుక అందించారు. దర్గాకు చాదర్ సమర్పించారు. ప్రతి ఏటా జరిగే దర్గా ఉర్సు ఉత్సవాలకు చాదర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా దర్గా నిర్వాహకులకు మోదీ చాదర్ అందించారు.

Pawan Kalyan: ఇంద్రకీలాద్రికి పవన్ కల్యాణ్… ‘వారాహి’కి వాహన పూజ చేయించిన జనసేనాని

మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొన్నారు. సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ ఛిస్తి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అజ్మీర్ షరీఫ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఖ్వాజా మొయినుద్దీన్ ప్రముఖ సూఫీ గురువుల్లో ఒకరు. ఆయనకు ‘గరీబ్ నవాజ్’గా పేరుంది. ఈ ఉర్సు ఉత్సవాలకు ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. దేశంలో జరిగే పెద్ద ఉర్సు ఉత్సవాల్లో ఇదీ ఒకటి. ఈ ఏడాదికి సంబంధించి ఉర్సు ఉత్సవం ఈ నెల 29న జరగనుంది. ఇది 811వ ఉర్సు ఉత్సవం. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

Anil K Antony: కాంగ్రెస్ పార్టీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన ఏకే ఆంటోని తనయుడు

రోజుకో కార్యక్రమం చొప్పున ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల 29 వరకు ఉత్సవాలు జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 1న కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల కోసం ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లేందుకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేస్తోంది. అనేక ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాలు ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నాయి.