PM Modi: “2024 ఎన్నికల తర్వాత దేశంలో రాష్ట్రాల సంఖ్య 50కు పెరుగుతాయ్”

2024 సాధారణ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలుంటాయని కర్ణాటక మంత్రి అంటున్నారు. ఇందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రమైన నార్త్ కర్ణాటక ఆ కొత్త రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటుందన్నారు.

PM Modi: “2024 ఎన్నికల తర్వాత దేశంలో రాష్ట్రాల సంఖ్య 50కు పెరుగుతాయ్”

Karnataka

PM Modi: 2024 సాధారణ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలుంటాయని కర్ణాటక మంత్రి అంటున్నారు. ఇందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రమైన నార్త్ కర్ణాటక ఆ కొత్త రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటుందన్నారు. “2024ఎన్నికల తర్వాత దేశంలో 50రాష్ట్రాలు కనిపిస్తాయి. ఇప్పటికే మోదీ దీనిపై నిర్ణయం తీసేసుకున్నారు” అని కర్ణాటక రాష్ట్ర పౌర వ్యవహరాల శాఖ మంత్రి ఉమేశ్ కట్టి వెల్లడించారు.

ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో జనాభా పెరుగుదల దృష్ట్యా రాష్ట్రాలను విడగొట్టడమనేది మంచి ప్రక్రియేనని పేర్కొన్నారు.

“ఇటువంటి ఐడియాలు మంచివే. ఎందుకంటే నార్త్ కర్ణాటకలో జనాభా పెరుగుతుంది. దానికి అనుగుణంగా అభివృద్ధి కూడా కావాలి. అయినప్పటికీ మేం కన్నడిగులం గానే ఉంటాం. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన ఎటువంటి హానీ జరగదు” అని ఉమేశ్ కట్టి అంటున్నారు.

కర్ణాటకను రెండుగా విడగొట్టడంతో పాటు ఉత్తరప్రదేశ్ ను నాలుగుగా, మహారాష్ట్రను మూడుగా చేస్తారని మంత్రి చెప్తున్నారు. రాష్ట్ర జనాభా 60ఏళ్లలో 2కోట్లు నుంచి 6.5కోట్లకు పెరిగిపోయిందని.. ఇలాంటి తరుణంలో 50రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం సరైన పనేనని అభివర్ణించారాయన.

Read Also : ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్ని సీట్లు అవసరం, వివరాలు

కట్టి స్టేట్మెంట్ కు అనుగుణంగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కామెంట్ చేయలేదు. ప్రత్యేక రాష్ట్రం గురించి ఎటువంటి ప్రపోజల్ రాలేదని చెప్తున్నారు. చాలా సంవత్సరాలుగా ఉమేశ్ కట్టి మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారని, తమకు దాని గురించి తెలియదని అన్నారు. కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోక సైతం కట్టి స్టేట్మెంట్ ను కొట్టిపారేశారు.