PM High Level Review : గ్రామాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని ఆందోళన..వాక్సినేషన్‌ వేగాన్ని పెంచి..ఆక్సిజన్ సరఫరా పెంచాలని ఆదేశాలు

గ్రామాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తంచేశారు. వాక్సినేషన్‌ వేగాన్ని పెంచి..ఆక్సిజన్ సరఫరా పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డోర్ టూ డోర్ సర్వే నిర్వహించి కరోనాను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

PM High Level Review : గ్రామాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని ఆందోళన..వాక్సినేషన్‌ వేగాన్ని పెంచి..ఆక్సిజన్ సరఫరా పెంచాలని ఆదేశాలు

Pm High Level Review On Corona

PM High Level Review on Corona: కరోనా ఫస్ట్ వేవ్ లో పట్టణాల్లోనే ఎక్కువగా కేసులు నమోదయ్యేవి. కానీ ఈ సెకండ్ వేవ్ లో పట్టణాలతో పాటు గ్రామాల్ని కూడా కబళించేస్తోంది కరోనా మహ్మారి. ఈ క్రమంలో కరోనా కట్టడిపై ప్రధాని మోదీ అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై ప్రధాని మోదీ శనివారం అత్యున్నతస్థాయి సమావేశం సందర్భంగా ప్రధాని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ పెంచాలని..గ్రామాల్లో ఆక్సిజన్‌ సరఫరా అవసరానికి తగినట్లుగా పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డోర్‌ టూ డోర్‌ సర్వే నిర్వహించాలని సూచించారు. కరోనా కట్టడికి ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్ల సేవలను ఉపయోగించుకోవాలనీ..కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగాన్ని పెంచాలన్నారు.

రాష్ట్ర, జిల్లాస్థాయిలో కరోనా పరిస్థితి, టెస్టులు, ఆక్సిజన్ లభ్యత, ఆరోగ్యసంరక్షణ కోసం తీసుకోవాల్సిన మౌలికసదుపాయాలు, టీకా రోడ్‌మ్యాప్‌పై అధికారులు ప్రధానికి సూచనలిచ్చారు. పాజిటివిటీ రేటు ఎక్కువున్నచోట టెస్టింగ్ మరింత పెంచాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు. ఎక్కడికక్కడ కంటైన్మెంట్ వ్యూహాలే ఇప్పుడు చాలా అవసరమన్నారు. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు పెంచాలనీ..గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరా సరిగా జరిగేలా చూడాలని..వెంటిలేటర్ల నిర్వహణ, తదితర పరికరాల వినియోగంలో సిబ్బందికి తగినవిధంగా శిక్షణ ఇచ్చి ప్రాణాలు పోకుండా కావాలని..సమీక్షలో అధికారులను ప్రధాని మోడీ ఆదేశించారు.