మోడీ ఎన్నికల స్టంట్ : 30 రోజుల్లో 157 ప్రాజెక్టులు ప్రారంభం

  • Publish Date - March 10, 2019 / 10:20 AM IST

ఢిల్లీ: లోక్‌సభతో పాటు 4 రాష్ర్టాలు… ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ఆదివారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చెయ్యనుంది. ఎన్నికల పోలింగ్ ఏప్రిల్, మే నెలల్లో 7 లేదా 8 విడతల్లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3తో ముగియనుంది.  సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.  ఎన్నికల  కోడ్ అమల్లోకి  రాకముందు గత నెల రోజులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో సహా పలువురు కేంద్ర మంత్రులు దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులకు శంకుస్ధాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.  

తన పదవీ కాలం ముగిసే లోగా …ఫిబ్రవరి 8నుంచి మార్చి 9 మధ్య ప్రధాని మోడీ  దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జాతీయ రహాదారులు, రైల్వే లైన్లు,  వైద్యకళాశాలలు,  ఆస్పత్రులు, గ్యాస్ పైపు లైనులు,  పవర్ ప్లాంట్లు ప్రారంభించటంతో పాటు  పలు అభివృధ్ది పనులకు శంకుస్ధాపనలు చేశారు.  జనవరి 8 నుంచి ఫిబ్రవరి 7 దాకా  ఉన్న సమయంలో ఆయన దేశవ్యాప్తంగా 57 ప్రాజెక్టులను ప్రారంభిస్తే, ఆతర్వాతి నెలలో  సుమారు 157 ప్రాజెక్టులకు శంకుస్ధాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.

గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ తన  పదవీకాల పరిమితి ముగిసేసమయంలో ఇటువంటి ఎన్నికల స్టంట్ కార్యక్రమాలు ఏమీ చేయలేదు. రెండో సారి ప్రధాని పదవి అలంకరించేందుకు మోడీ  ఓటర్లను ఆకర్షించేందుకు  వేల కోట్ల  విలువ చేసే ప్రజాకర్షక పధకాలను ప్రకటించారు.. 

ట్రెండింగ్ వార్తలు