Delhi-Mumbai Expressway: నవ శకానికి నాంది.. ఢిల్లీ-ముంబై ఎక్స్‭ప్రెస్‭వే (మొదటి దశ) ప్రారంభించిన ప్రధాని మోదీ

ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే ఢిల్లీ-జైపూర్ (రాజస్థాన్ రాజధాని) మధ్య ఎక్స్‭ప్రెస్‭వేను ప్రారంభించినట్లు విమర్శకులు చెబుతున్నారు. ఇక తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్‭ప్రెస్‭వేతో ఢిల్లీ-జైపూర్ మధ్య ప్రయాణ సమయం 5 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతుందని అంటున్నారు

Delhi-Mumbai Expressway: నవ శకానికి నాంది.. ఢిల్లీ-ముంబై ఎక్స్‭ప్రెస్‭వే (మొదటి దశ) ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi Inaugurates Stretch Of Delhi-Mumbai Expressway

Delhi-Mumbai Expressway: దేశానికి తలమానికంగా భావిస్తున్న ఢిల్లీ-ముంబై ఎక్స్‭ప్రెస్‭వేను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు. రాజస్థాన్‭లోని దౌసాలో కేంద్ర రోడ్డు-రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో కలిసి ఈ రోడ్డును ప్రారంభించారు. అయితే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి జైపూర్ వరకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 246 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే ప్రారంభమైంది. ఇది ఢిల్లీ-ముంబై ఎక్స్‭ప్రెస్‭వే మొదటి దశగా చెబుతున్నారు.

ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే ఢిల్లీ-జైపూర్ (రాజస్థాన్ రాజధాని) మధ్య ఎక్స్‭ప్రెస్‭వేను ప్రారంభించినట్లు విమర్శకులు చెబుతున్నారు. ఇక తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్‭ప్రెస్‭వేతో ఢిల్లీ-జైపూర్ మధ్య ప్రయాణ సమయం 5 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతుందని అంటున్నారు. ఢిల్లీ-దౌసా (జైపూర్ సమీపం) వరకు నిర్మాణం పూర్తి చేస్తున్న ఈ మొదటి దశకు 12,150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు.

Turkey-Syria Earthquake: సహాయక చర్యల్లో అద్భుతం.. ఆ ఐదుగురిని కాపాడేశారు

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎక్స్‭ప్రెస్‭వే విశేషాలేంటో చూద్దామా..
*ముంబై-ఢిల్లీ ఎక్స్‭ప్రెస్‭వే మొత్తం పొడవు 1,386 కిలో మీటర్లు
*ఢిల్లీలోని డీఎన్‭డీ ఫ్లైఓవర్ నుంచి ముంబైలోని జేఎన్‭పీటీ వరకు విస్తరించి ఉంది
*ఎనిమిది వరుసలతో నిర్మితమవుతున్న దేశంలోనే అతిపెద్ద ఎక్స్‭ప్రెస్‭వే ఇదే
*ఈ ఎక్స్‭ప్రెస్‭వే నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు
*ఈ ఎక్స్‭ప్రెస్‭వే పూర్తైతే ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ సమయం సగం తగ్గుతుంది. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న ప్రయాణం, 12 గంటలకు తగ్గుతుంది
*ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర (6 రాష్ట్రాలు) రాష్ట్రాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది
*ఈ ఎక్స్‭ప్రెస్‭వే 93 పీఎం గతిశక్తి ఎకనామిక్ నోడ్స్, 13 పోర్టులు, 8 మేజర్ ఎయిర్‭పోర్టులు, 8 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను కలుపుకుని పోతుంది
*వన్యప్రాణుల సంరక్షణ కోసం ఓవర్ పాస్, అండర్ పాసులు నిర్మించిన ఆసియాలోని మొట్టమొదటి ఎక్స్‭ప్రెస్‭వే ఇదే
*దీని కోసం మొత్తంగా 25,000 లక్షల టన్నుల బిటుమెన్ ఉపయోగించారు. అలాగే శిక్షణ పొందిన 4,000 మంది ఇంజనీర్లు పని చేస్తున్నారు
*ఈ ఎక్స్‭ప్రెస్‭వే వల్ల ఏడాదికి 300 మిలియన్ లీటర్ల ఇంధనం, 800 మిలియన్ కిలోగ్రామ్ల కార్బన్ ఆదా అవుతుంది
*ఈ ఎక్స్‭ప్రెస్‭వేను ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకోవచ్చు. విద్యుత్ వాహనాల రాకపోకలకు అనుగుణంగా దీన్ని తీర్చి దిద్దుతున్నారు
*విద్యుత్ వాహనాల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్స్‭ప్రెస్‭వే వెంట అక్కడక్కడ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు
*120 కిలీమీటర్ల వేగ పరిమితికి అనుమతి ఉంటుంది. దేశంలో అత్యంత వేగవంతమైన రోడ్డు ఇదే
*ఈ ఎక్స్‭ప్రెస్‭వే మీద హెలిపాడ్లు, ట్రౌమా కేర్ సెంటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు

Indian Constitution: అంత దమ్ము మనకు భారత రాజ్యాంగమే ఇచ్చింది.. సీజేఐ చంద్రచూడ్