Tejashwi Yadav : నితీశ్ ని మోదీ అవమానించారు

డీయూ అధినేత,బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. కులాల వారీగా జనగణన అంశంపై ప్రధానితో మాట్లాడేందుకు ఆయన అపాయింట్మెంట్ ని నితీష్ కోరగా..ఇంతవరకూ నితీష్ కి మోదీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని తేజస్వీ తెలిపారు.

Tejashwi Yadav : నితీశ్ ని మోదీ అవమానించారు

Tejaswi

Tejashwi Yadav జేడీయూ అధినేత,బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. కులాల వారీగా జనగణన అంశంపై ప్రధానితో మాట్లాడేందుకు ఆయన అపాయింట్మెంట్ ని నితీష్ కోరగా..ఇంతవరకూ నితీష్ కి మోదీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని తేజస్వీ తెలిపారు. కాగా, కులాల వారీగా జనగణన విషయమై మోదీని కలిసేందుకు తాను పీఎంవో(ప్రధానమంత్రి కార్యాలయం)కి లేఖ రాశానని,కానీ ఇప్పటివరకు స్పందంన లేదని సీఎం నితీష్ కుమార్ స్వయంగా వ్యాఖ్యానించిన కొద్ది రోజుల్లోనే తేజస్వీ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

శుక్రవారం పాట్నాలో విలేఖరుతో మాట్లాడిన తేజస్వీ యాదవ్..కేంద్రంలో, బీహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయ్. అందుకే బీహార్‌‌లో ప్రతిపక్ష నేతలంతా కలిసి రాజకీయ విభేదాలను పక్కపెట్టి సీఎం నితీశ్ కుమార్‌‌ను కలిశాం. కులాల వారీగా జనగణన చేపట్టాల్సిన అవసరాన్ని ప్రధానికి వివరించేందకు అపాయింట్‌మెంట్ కోరాలని అడిగాం. ఈ నేపథ్యంలో ఈ నెల 4న సీఎం నితీశ్‌ కుమార్‌, ప్రధాని మోదీకి లేఖ రాశారని, అయితే పీఎంవో కార్యాలయం నుంచి ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు.

ప్రధాని మోడీ ఇప్పటికీ నితీశ్‌ కుమార్ కలిసేందుకే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, కానీ మిగతా పార్టీల నేతలు, వేర్వేరు వ్యక్తులను కలుస్తూ ట్విట్టర్‌‌లో ఫొటోలు పెడుతున్నారని, ఇది ఒక రకంగా నితీశ్‌ను అవమానించడమేనని తేజశ్వీ యాదవ్ చెప్పారు. కాగా, ఇవాళ ఉదయం.. బీహార్‌ అసెంబ్లీ నేతలు ఈ అంశంపై కలిసి చర్చించేందుకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరుతూ తేజశ్వి యాదవ్ ఓ లేఖ రాశారు. తన లేఖపై మోదీ స్పందించకపోతే ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద తాము ధర్నా చేస్తామని తేజస్వీ హెచ్చరించారు.

READ OBC Bill : ఓబీసీ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం