PM Modi : ఆయిల్,గ్యాస్ కంపెనీల సీఈవోలతో మోదీ భేటీ

దిగ్గజ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల సీఈవోలతో బుధవారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్

PM Modi : ఆయిల్,గ్యాస్ కంపెనీల సీఈవోలతో మోదీ భేటీ

Pm Modi

PM Modi దిగ్గజ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల సీఈవోలతో బుధవారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్, రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ, సౌదీ ఆరామ్​కో సీఈవో అమిన్ నాజర్ ,రష్యాకు చెందిన రోస్​నెఫ్ట్ సీఈవో డాక్టర్ ఇగోర్ సీచిన్ సహా పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మండిపోతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. పెట్రోలియం నిక్షేపాల అన్వేషణ, భారత్​ లోని హైడ్రోకార్బన్ రంగంలో ఉత్పత్తి, ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఇక, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో కేంద్రం ఇతర మార్గాలను అన్వేషిస్తున్న విసయం తెలిసిందే. కేంద్రం రికార్డు స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను అదుపులో ఉంచేందుకు చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలతో పెట్రోలియం శాఖ చర్చిస్తోంది.

మరోవైపు ఈ నెల 20-22 మధ్య సెరా వీక్ కాన్ఫరెన్స్​లో భాగంగా ప్రపంచంలో చమురును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఢిల్లీలో సమావేశమవుతున్నాయి ఆయా దేశాల ఇంధన శాఖ మంత్రులు, చమురు సంస్థల ప్రతినిధులు దీనికి హాజరు కానున్నారు. భారత్ తరఫున పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

ALSO READ Fuel Stations: రాష్ట్ర వ్యాప్తంగా మూసేయడానికి సిద్ధమైన 800 పెట్రోల్ బంకులు