PM Modi : ఆ విద్యార్థులకు మోడీ సర్ ప్రైజ్

సీసీబీఎస్​ఈ 12వ తరగతి విద్యార్థులు,వారి తల్లిదండ్రులను ప్రధాని మోడీ ఆశ్చర్చపర్చారు.

PM Modi : ఆ విద్యార్థులకు మోడీ సర్ ప్రైజ్

Pm Modi

PM Modi సీసీబీఎస్​ఈ 12వ తరగతి విద్యార్థులు,వారి తల్లిదండ్రులను ప్రధాని మోడీ ఆశ్చర్చపర్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కేంద్ర విద్యాశాఖ గురువారం నిర్వహించిన వర్చువల్ భేటీలో ఆకస్మికంగా పాల్గొన్న ప్రదాని హాజరై విద్యార్థులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. వాస్తవానికి ఈ కార్యక్రమం ప్రధాని షెడ్యూల్‌లో లేదు. అయినప్పటికీ హఠాత్తుగా ఈ వర్చువల్ మీట్‌కు మోడీ హాజరై… కొద్ది సమయం పాటు విద్యార్థులతో ముచ్చటించారు.

వర్చువల్ మీట్ గా ఆకశ్మికంగా ప్రత్యక్షమైన ప్రధాని మోడీ విద్యార్థులతో మాట్లాడుతూ..నేను సడన్ గా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని భావిస్తున్నాను. మీరు ఆనందంగా ఉన్నారు. పరీక్షలు రద్దయినందున మీ ఆనందం అనంతంగా ఉన్నట్లు అనిపిస్తోందని ప్రధాని సరదాగా సంభాషించారు. విద్యార్ధులతో మాట్ల పరీక్షలు రద్దైనందున ఏం చేయాలనుకుంటున్నారని విద్యార్థులను అడిగారు మోదీ. మీరు పరీక్షలకు ముందే టెన్షన్ పడ్డారా అని విద్యార్థులని మోడీ అడగ్గా..దానికి వాళ్లు సానుకూలంగా స్పందించడంతో…అప్పుడు నా పుస్తకం రాయడం వ్యర్థం, మీరు టెన్షన్ పడకూడదనే నేను ఎగ్జామ్ వారియర్ బుక్ రాశాను (పరీక్షల మీద)అని ప్రధాని విద్యార్ధులతో అన్నారు. దీంతో కొద్ది క్షణాల పాటు అందరూ సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ మూమూలుగానే విద్యార్థులు, ప్రధాని మధ్య మాటల సంభాషణ జరిగింది. గౌహతి చెందిన ఓ విద్యార్థి మాట్లాడుతూ..తాను ఎగ్జామ్ వారియర్స బుక్ చదివానని,ఆ ప్రధాని పేర్కొన్న కొన్ని సలహాలను ప్రస్తావిస్తూ అవి తనకు బాగా ఉపయోగపడ్డాయని అన్నాడు

పంచకులకి చెందిన హితేశ్వర్ శర్మ అనే విద్యార్థినుద్దేశించి మోడీ మాట్లాడుతూ..నువ్వు 10వ తరగతిలో టాపర్ గా నిలిచావు..ఖచ్చితంగా 12వ తరగతిలో టాప్ ర్యాంక్ వస్తుందని ఊహించి ఉంటావు.. కానీ ఇప్పుడు పరీక్షలు రద్దుమ అయ్యాయి..నువ్వు అనుకున్నది జరగదు అని అనగా..నేను చేసిన కృషి వృద్దాగా పోదంటూ ఆ విద్యార్థి సమాధానమిచ్చాడు. తెలివి మనతోనే ఉంటుందని అన్నాడు.

పరీక్షలు రద్దైనందున ఈ సమయాన్ని సృజనాత్మకంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు ప్రధాని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి గుర్తుంచుకోవాలని వారికి సూచించారు. పరీక్షలు ఏవైనా ఒత్తిడికి గురికావొద్దని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు నేర్పించిన బృంద స్ఫూర్తి కరోనా రెండో దశలో దేశవ్యాప్తంగా కనిపించిందని ప్రధానమంత్రి అన్నారు. కరోనాను జయిస్తామని ఇప్పుడు ప్రతిఒక్క భారతీయుడు చెబుతున్నాడని చెప్పారు. విద్యార్థులందరూ దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల రద్దు ప్రకటనపై తమ అభిప్రాయాలను పలువురు విద్యార్థులు పంచుకున్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని హిమాచల్​ప్రదేశ్​కు చెందిన ఓ విద్యార్థి చెప్పారు.