కుంభమేళాలో పాల్గొన్న మోడీ : కార్మికుల పాదాలు కడిగాడు

  • Published By: venkaiahnaidu ,Published On : February 24, 2019 / 11:19 AM IST
కుంభమేళాలో పాల్గొన్న మోడీ  : కార్మికుల పాదాలు కడిగాడు

ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో  ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాకంగా నిర్వహిస్తున్న కుంభమేళాలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. పవిత్ర త్రివేణి సంగం ఘాట్ లో పుణ్యమాచరించిన తర్వాత హారతి ఇచ్చారు.అక్కడ నిర్వహించిన పూజలో మోడీ పాల్గొన్నారు. మోడీతో పాటు యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం పారిశుధ్య కార్మికులను సన్మానించి వారి పాదాలను కడిగారు.  

త్రాగునీరు,పారిశుధ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్వచ్చ్ కుంభ్ స్వచ్చ్ ఆధార్ కార్యక్రమంలో పాల్గొని పారిశుధ్య కార్మికులకు, పోలీస్ సిబ్బందికి, నావికులకు, స్వచ్చ్ కుంభ్,స్వచ్చ్ ఆధార్ అవార్డులను మోడీ ప్రధానం చేయనున్నారు. స్వచ్చ్ సేవా సమ్మాన్ బెన్ ఫిట్స్ ప్యాకేజీకి సంబంధించిన డిజిటల్ అనౌన్స్ మెంట్ ఈ సందర్భంగా ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ని మోడీ గోరఖ్ పూర్ లో ప్రారంభించారు.