యూపీలో ఆత్మ నిర్భర్ రోజ్ గార్ అభియాన్ ను ప్రారంభించిన ప్రధాని : ప్రజలకు మోడీ మోటివేషనల్ స్పీచ్

  • Published By: nagamani ,Published On : June 26, 2020 / 06:12 AM IST
యూపీలో ఆత్మ నిర్భర్ రోజ్ గార్ అభియాన్ ను ప్రారంభించిన ప్రధాని : ప్రజలకు మోడీ మోటివేషనల్ స్పీచ్

ఉత్తరప్రదేశ్ లో ఆత్మ నిర్భర్ రోజ్ గార్ అభియాన్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించిన  ప్రధాని యూపీ వాసులకు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. కరోనా కుదేలైన ఆర్ధిక వ్యవస్థకు ఊపిరిలూదడానికి…ఉత్తరప్రదేశ్ లో కోటిమందికి ఉపాధి కల్పించటే లక్ష్యంగా మోడీ  ఆత్మ నిర్భర్ రోజ్ గార్ అభియాన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని యూపీలోని 6 జిల్లాలోని గ్రామస్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కష్టం వచ్చిందని కృంగిపోకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ప్రతీ ఒక్కరూ ప్రయత్నించాలని..దీనికి ప్రజలందరూ సహకరించాలని తద్వారా ఆర్థికంగా బలపడాలని ప్రజలకు ప్రధాని మోడీ సూచించారు. కష్టం వచ్చిన సమయంలో ప్రజలు సమన్వయంతో తిరగి బలపడేలా ఆత్మవిశ్వాసంతో పోరాడటంలో భారతీయులు ఎప్పుడు ముందుంటారని మోదీ తెలిపారు.

కరోనాతో ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయనీ..ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రపంచం యుద్ధం చేస్తోందని.. కానీ మనిషి ఓడిపోవడానికి సిద్ధంగా లేడని ప్రధాని కష్టంనుంచి కోలుకుని మనిషి నిలబడతాడని అప్పుడు ఇటువంటి ఎన్ని కఠినవైరస్ లు వచ్చినా మనలని ఏమీ చేయలేవనీ ప్రతీ మనిషి పోరాటాన్ని అలవరచుకుని కష్టాల్ని జయించాలని సూచించారు. 

ఈ వైరస్ నుంచి మనం కాపాడుకుంటూనే ముందుకు వెళ్లాలని.. మనం మరింత దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్లాలని మోడీ ప్రజలను మోటివేట్ చేశారు. మన సంకల్పం.. ఈ సంక్షోభం కంటే చాలా గొప్పదన్నారు. 21వ శతాబ్ధం భారతదేశానిదేన్నైనా సరే  ఆత్మస్థైర్యం కలిగిన భారత్ ను ఏమీ చేయలేవని అన్నారు. ప్రస్తుతం దేశం కీలకమైన దశలో ఉందని, ఈ సంక్షోభం మనకు ఒక అవకాశంగా మారాలని ప్రధాని ఆకాంక్షించారు. కాగా..కరోనా వైరస్ కారణంగా కుదేలైన ఆర్ధిక వ్యవస్థకు ఊపిరిలూదడానికి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ. 20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజ్‌ను ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. 

Read:  పెరగనున్న Popcorn ధరలు : 18 శాతం GST