PM Modi: కొవిడ్ వర్కర్ల కోసం క్రాష్ కోర్స్ లాంచ్ చేసిన పీఎం మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొవిడ్ వర్కర్ల కోసం క్రాష్ కోర్స్ లాంచ్ చేశారు. కొవిడ్ వర్కర్లలో నైపుణ్యం పెంచే దిశగా ప్లాన్ చేసిన మోదీ.. కస్టమైజ్డ్ క్రాష్ కోర్స్ ప్రోగ్రాం ను కొవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం జూన్ 18న ఉదయం 11గంటలకు లాంచ్ చేశారు. భవిష్తత్ లో అవసరమయ్యే మ్యాన్ పవర్ కోసం ముందుగా అలర్ట్ అయ్యారు.

PM Modi: కొవిడ్ వర్కర్ల కోసం క్రాష్ కోర్స్ లాంచ్ చేసిన పీఎం మోదీ

Pm Modi

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొవిడ్ వర్కర్ల కోసం క్రాష్ కోర్స్ లాంచ్ చేశారు. కొవిడ్ వర్కర్లలో నైపుణ్యం పెంచే దిశగా ప్లాన్ చేసిన మోదీ.. కస్టమైజ్డ్ క్రాష్ కోర్స్ ప్రోగ్రాం ను కొవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం జూన్ 18న ఉదయం 11గంటలకు లాంచ్ చేశారు. భవిష్తత్ లో అవసరమయ్యే మ్యాన్ పవర్ కోసం ముందుగా అలర్ట్ అయ్యారు.

కస్టమైజ్డ్ క్రాష్ కోర్స్ ప్రోగ్రాంలో భాగంగా ఆరు ప్రోగ్రాంలు ఉండనున్నాయి. హోం కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్డ్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, శాంపుల్ కలెక్షన్ సపోర్ట్, మెడికల్ ఎక్విప్‌మెంట్ సపోర్ట్ అంశాలను ఇందులో ప్రస్తావించనున్నారు. ఈ ట్రైన్డ్ వర్కర్లు కొవిడ్ 19 పేషెంట్లను ట్రీట్ చేసే వైద్యులకు సహకరిస్తారు.

దేశంలో దాదాపు లక్ష మందిని ఫ్రంట్ లైన్ వర్కర్లుగా మార్చనున్నట్లు ప్రధాని అన్నారు. దీని కోసం 26రాష్ట్రాల్లో 111 ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఈ లాంచింగ్ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి కూడా పాల్గొన్నారు. ఈ కోర్సు కేంద్రం అందిస్తున్న ప్రధాన మంత్రి కౌశల్ వికాశ్ యోజన 3.0కిందకు వస్తుంది.

ఈ పథకానికి సంబంధించి రూ.276కోట్లు మంజూరు చేశారు. నిస్వార్థంగా కొవిడ్ సేవలు అందిస్తోన్న హెల్త్ సెక్టార్ కు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు.