Modi and Kharge: ‘కుక్క’ వ్యాఖ్యలపై ఓవైపు కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం.. మరోవైపు విందులో సరదాగా గడిపిన మోదీ, ఖర్గే

మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీపై శునక వ్యాఖ్యలు సరికాదని, ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశఆరు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మగాంధీ అన్నారని రాజ్యసభలో వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్.. ఖర్గే క్షమాపణ చెప్పకపోతే రాజ్యసభలో ఉండే అర్హత ఉండదని అన్నారు

Modi and Kharge: ‘కుక్క’ వ్యాఖ్యలపై ఓవైపు కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం.. మరోవైపు విందులో సరదాగా గడిపిన మోదీ, ఖర్గే

PM Modi, Mallikarjun Kharge share millet lunch after Congress chief’s dog jabs

Modi and Kharge: స్వాతంత్ర్య పోరాటంలో భారతీయ జనతా పార్టీ ఒక కుక్కను కూడా కోల్పోలేదంటూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ లోపల, బయట బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాగా, ఈ తరుణంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, విపక్ష నేత ఖర్గే ఒకే టేబుల్ వద్ద సరదాగా విందు ఆరగిస్తూ కనిపించారు. వచ్చే ఏడాదిని ప్రపంచ ‘చిరుధాన్యాల ఏడాది’గా ప్రకటించనున్న నేపథ్యంలో పార్లమెంట్ ప్రాంగణంలో చిరుధాన్యాలతో వండిన ప్రత్యేక వంటకాలతో ఏర్పాటు చేసిన విందులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి జగ్‭దీప్ ధన్‭కడ్, లోక్‭సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‭నాథ్ సింగ్ సహా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు.

Elon Musk: మస్క్‭కు వ్యతిరేకంగా మిలియన్ల ఓట్లు.. ఇంకెప్పుడు తప్పుకుంటావంటూ మండిపడుతున్న నెటిజెన్లు

ఈ ఫొటోలను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించేందుకు మేము సిద్ధమవుతున్న తరుణంలో, పార్లమెంట్‌లో చిరుధాన్యాల వంటకాలతో చేసిన విలాసవంతమైన మధ్యాహ్న భోజనానికి హాజరయ్యాము. పార్టీ శ్రేణులకు అతీతంగా పాల్గొనడం ఆనందాన్నిచ్చింది’’ అని ట్వీట్ చేశారు.

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో ఫౌంటేన్ పెన్నులపై నిషేధం.. ఎందుకో తెలుసా?

ఇకపోతే, ఖర్గే చేసిన ‘కుక్క’ వ్యాఖ్యలు ఈరోజు రాజ్యసభను కుదిపివేశాయి. ఖర్గే క్షమాపణ చెప్పాలంటూ భారతీయ జనతా పార్టీ నేతలు సభలోనే ఆందోళనకు దిగారు. అయితే అందుకు ఖర్గే నిరాకరించడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం రాజస్తాన్ రాష్ట్రంలోని అల్వార్‭లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ ‘‘బయటికేమో సింహంలాంటి మాటలు మాట్లాడతారు. కానీ చిట్టెలుకలా ప్రవర్తిస్తున్నారు. సరిహద్దుల వెంబడి చైనా దురాక్రమణలకు పాల్పడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? దీనిపై పార్లమెంట్‭లో చర్చ కూడా చేయడం లేదు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసింది. అనేక మంది కాంగ్రెస్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారు. మరి బీజేపీ ఏం చేసింది? స్వాతంత్ర్యం కోసం బీజేపీ ఒక కుక్కనైనా కోల్పోయిందా? మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారు. ఇంతకీ దేశానికి వాళ్లు (బీజేపీ) చేసింది ఏంటి?’’ అని ఖర్గే మండిపడ్డారు.

Nakul Nath: భారత్ జోడో యాత్ర కంటే నా ర్యాలీలే పవర్‭ఫుల్.. కాంగ్రెస్ యువనేత ఆసక్తికర వ్యాఖ్యలు

అంతే, మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీపై శునక వ్యాఖ్యలు సరికాదని, ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశఆరు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మగాంధీ అన్నారని రాజ్యసభలో వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్.. ఖర్గే క్షమాపణ చెప్పకపోతే రాజ్యసభలో ఉండే అర్హత ఉండదని అన్నారు. అయితే పార్లమెంట్ వెలుపల చేసిన వ్యాఖ్యలపై ఎందుకంత మిడిసిపాటని, వాటిని సభలో చర్చించాల్సిన అవసరం లేదని ఖర్గే సమాధానం ఇచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని మీరు క్షమాపణలు అడుగుతున్నారా? అంటూ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.