PM Modi Meets President Kovind : రాష్ట్రపతితో ప్రధాని భేటీ

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(జులై-15,2021)రాష్ట్రతిని కలిశారు.

PM Modi Meets President Kovind : రాష్ట్రపతితో ప్రధాని భేటీ

Pm President

PM Modi Meets President Kovind భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(జులై-15,2021)రాష్ట్రతిని కలిశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రామ్ నాథ్ కోవింద్ ని కలిసిన మోదీ..పలు ముఖ్యమైన ఇష్యూస్ గురించి ఆయనకి వివరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ లో ఓ ట్వీట్ లో పేర్కొంది. జులై-19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రపతితో సమావేశమైన ప్రధాని మోదీ..ఏయే అంశాల గురించి రాష్ట్రపతికి వివరించారన్నది ఇంకా తెలియరాలేదు.

కాగా, ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పర్యటించారు. చాలా రోజుల త‌రువాత వార‌ణాసి ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని, కాశీలో జ‌రుగుతున్న అభివృద్ధి అంతా కాశీవిశ్వేశ్వ‌రుడి ఆశీర్వాదంతోనే జ‌రుగుతుంద‌ని అన్నారు. వారణాశిలో రూ.1500 కోట్ల రూపాయ‌ల‌తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు మోదీ.

వారణాశిలో భారీస్థాయిలో నిర్మితమైన రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రధాని ప్రారంభించారు. క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో రుద్రాక్ష మొక్క‌ను నాటారు. జపాన్ సాయంతో, ఉన్నత కళానైపుణ్యంతో ఈ కేంద్రాన్ని నిర్మించినట్టు మోదీ వెల్లడించారు. వారణాసిలోని ఈ రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ సదస్సులు, సమావేశాలు నిర్వహించుకునేందుకు పర్యాటకులను, వ్యాపారవేత్తలను ఆకర్షిస్తుందని తెలిపారు. భారత్, జపాన్ స్నేహ బంధానికి ఈ కన్వెన్షన్ సెంటర్ ఓ నిదర్శనం అని పేర్కొన్నారు. 2015లో భారత్ లో పర్యటించిన అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఈ భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఉదారంగా ఆర్థికసాయం ప్రకటించారు. ఇది భారతదేశ ఆధ్మాత్మిక నగరం వారణాసికి తాము ఇస్తున్న కానుక అని అప్పుడు ప్రకటించారు.

క‌రోనా సెకండ్ వేవ్‌ను యూపీ ప్ర‌భుత్వం స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంద‌ని.. ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొన‌డంలో తీసుకున్న చ‌ర్య‌లు భేష్ అని వారణాశి పర్యటనలో మోదీ అన్నారు. ఇక యూపీలో ఆక్సీజ‌న్ ప్లాంట్ల‌ను పెంచుతున్నామ‌ని, ఒక్క వార‌ణాసిలోనే 14 ప్లాంట్ల‌ను నెల‌కొల్పిన‌ట్టు మోదీ పేర్కొన్నారు. చాలా రోజుల త‌రువాత వార‌ణాసి ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని, కాశీలో జ‌రుగుతున్న అభివృద్ధి అంతా కాశీవిశ్వేశ్వ‌రుడి ఆశీర్వాదంతోనే జ‌రుగుతుంద‌ని అన్నారు.