తాజ్ మహల్ ను అమ్మేయనున్న మోడీ సర్కార్!

  • Published By: venkaiahnaidu ,Published On : February 4, 2020 / 07:49 PM IST
తాజ్ మహల్ ను అమ్మేయనున్న మోడీ సర్కార్!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ తమ టాప్ గన్స్ అయిన మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ,ప్రియాంకగాంధీ వాద్రాలను ప్రచార బరిలోకి దించింది. మంగళవారం ఢిల్లీలోని సంగమ్ విహార్,జంగ్పురలో రెండు ర్యాలీలో పాల్గొన్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఓ ర్యాలీలో రాహుల్ తో కలిసి పాల్గొన్నారు ప్రియాంకగాంధీ. ఢిల్లీ పోల్ ప్రచారంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తమ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడానికి ఇదే మొదటిసారి.

ఈ సందర్భంగా రాహుల్, ప్రియాంకలు మోడీ,బీజేపీపైనే ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ కేవలం ద్వేషాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది తప్ప ఉగ్యోగాల కల్పనకు ఏమీ చెయ్యట్లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. జంగ్పుర కాంగ్రెస్ అభ్యర్థి తర్వీందర్ మార్వాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ…హిందూయిజం అందరినీ కలుపుకొని వెళ్లడం గురించి చెబుతోంది. కానీ మోడీ,ఆర్ఎస్ఎస్ ది ఏ విధమైన హిందూ ధర్మం. దేశభక్తులను ఒకరినొకరు కొట్టుకునేలా చేస్తున్న వ్యక్తులు దేశభక్తులు కాగలరా అంటూ మోడీని ఉద్దేశించి రాహుల్ విమర్శించారు.

చైనా తప్ప మిగిలిన ప్రపంచదేశాలన్నీ భారత్ లో పెట్టుబడులు పెట్టాలనుకున్నాయని,కానీ వాళ్లు ఇప్పుడు భారత్ ను చూస్తే ద్వేషం,రేప్ లు,గూండాయిజం,హత్యలు,హింసను చూస్తున్నారని అన్నారు. గడిచిన ఐదేళ్లలో ఒక భారతీయుడు మరో భారతీయుడితో ద్వేషంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఇది మన చరిత్ర కాదన్నారు. భారత్ ప్రేమించే దేశమని రాహుల్ అన్నారు.

ఈ సందర్భంగా హిందుస్థాన్ పెట్రోలియం,రైల్వేస్,ఎయిర్ ఇండియా,ఇండియన్ ఆయిల్ వంటి ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలపై ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేశారు. ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా అనే మంచి నినాదాన్ని రూపొందించారు, కాని యూపీలోని ఆగ్రాలో ఒక్క ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయలేదన్నారు.ఏదో ఒకరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజ్ మహల్ ను కూడా అమ్మేయవచ్చని రాహుల్ అన్నారు. బీజేపీ ఉద్యోగం హింసను వ్యాప్తిచేయడమేనని రాహుల్ అన్నారు.