PM Modi: రొట్టె తయారు చేసిన బిల్‌ గేట్స్‌ను మెచ్చుకున్న మోదీ.. మరో సలహా ఇచ్చిన ప్రధాని.. ఇంతకీ అదేంటంటే!

ఈ వీడియోలో ఐటన్.. బిల్ గేట్స్‌కు రోటీ ఎలా చేయాలో నేర్పించారు. బెర్నాథ్‌తో కలిసి బిల్ గేట్స్ రోటీ తయారు చేసి, టేస్ట్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను.. ముఖ్యంగా భారతీయులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ఈ రోటీ వీడియో ప్రధాని మోదీకి కూడా చేరింది.

PM Modi: రొట్టె తయారు చేసిన బిల్‌ గేట్స్‌ను మెచ్చుకున్న మోదీ.. మరో సలహా ఇచ్చిన ప్రధాని.. ఇంతకీ అదేంటంటే!

PM Modi: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేల్స్ ఇటీవల రోటీ తయారు చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఫుడ్ వ్లాగర్ ఐటన్ బెర్నాథ్‌తో కలిసి బిల్ గేట్స్ రోటీ తయారు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బిల్ గేట్స్, ఐటన్ బెర్నాథ్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేశారు.

Son Ordered Food: తండ్రి ఫోన్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ఆరేళ్ల కొడుకు.. బిల్ చూసి తండ్రి షాక్.. ఇంతకీ బిల్లు ఎంతైందంటే!

ఈ వీడియోలో ఐటన్.. బిల్ గేట్స్‌కు రోటీ ఎలా చేయాలో నేర్పించారు. బెర్నాథ్‌తో కలిసి బిల్ గేట్స్ రోటీ తయారు చేసి, టేస్ట్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను.. ముఖ్యంగా భారతీయులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ఈ రోటీ వీడియో ప్రధాని మోదీకి కూడా చేరింది. దీంతో మోదీ దీనిపై స్పందించారు. రోటీ తయారు చేసిన బిల్ గేట్స్‌ను ప్రధాని అభినందించారు. మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయంపై తన అభినందన తెలిపారు. అలాగే బిల్ గేట్స్‌కు మరో సూచన కూడా చేశారు.

Edgardo Greco: పిజ్జా చెఫ్‌గా పని చేస్తున్న మాఫియా డాన్.. 16 ఏళ్లకు పట్టుబడ్డ నిందితుడు

‘‘బిల్ గేట్స్‌కు అభినందనలు. ప్రస్తుతం దేశంలో మిల్లెట్స్ ట్రెండ్ నడుస్తోంది. మిల్లెట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. మిల్లెట్స్‌తో అనేక రకాల వంటలు తయారు చేయొచ్చు. మీరు వాటిలో ఈసారి ఏదైనా ట్రై చేయొచ్చు’’ అని బిల్ గేట్స్‌కు మోదీ సూచించారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం దేశంలో మిల్లెట్స్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. మిల్లెట్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అందువల్లే మిల్లెట్స్‌తో ఏదైనా ఆహారం తయారు చేయాలని మోదీ బిల్ గేట్స్‌కు సూచించారు.

 

 

View this post on Instagram

 

A post shared by Bill Gates (@thisisbillgates)