PMModi Red Fort Speech : మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం- ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం

భారత్‌ స్వాతంత్ర్య స్వప్నం ఎర్రకోట నుంచి ప్రతిధ్వనించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహనీయుల త్యాగాల ఫలితంగా..

PMModi Red Fort Speech : మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం- ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం

Pmmodi Red Fort Speech

PMModi Red Fort Speech : భారత్‌ స్వాతంత్ర్య స్వప్నం ఎర్రకోట నుంచి ప్రతిధ్వనించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్య ఫలాలు మనం అనుభవిస్తున్నామని ప్రధాని అన్నారు. సిక్కు గురువుల ఆదర్శాలను భారత్‌ అనుసరిస్తోందని చెప్పారు. మన గురువులు సామాజిక బాధ్యతలు నిర్వర్తించారని మోదీ అన్నారు. సామాజిక బాధ్యత కోసం గురువులు తమ జీవితాలను సమర్పించినట్లు ఆయన తెలిపారు. గురువులు తమ శక్తిని సేవా మాధ్యమంగా మలుచుకున్నారని, దురాఘతాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా దేశాన్ని గొప్ప శక్తి నడిపించిందని ప్రధాని మోదీ అన్నారు.

సిక్కుమత గురువు తేగ్‌ బహదూర్‌ 400వ జయంతి సందర్భంగా గురువారం రాత్రి ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక తపాలా బిళ్ల, స్మారక నాణెం విడుదల చేశారు. కాగా, సూర్యాస్తమయం తర్వాత ఎర్రకోట నుంచి ప్రసంగించిన మొదటి ప్రధాని మోదీ కావడం విశేషం.

400 మంది కళాకారులు ‘శబ్ధ్ కీర్తన’ను ప్రదర్శించారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రిత్వ శాఖ, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశ, విదేశాల్లోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గురుతేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్ కార్యక్రమాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఢిల్లీ పోలీసులు సహా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన వెయ్యి మంది సిబ్బందితో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఎర్రకోట కాంప్లెక్స్‌లో దాదాపు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

సాధారణంగా ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాత్రమే ఎర్రకోట నుంచి భారత ప్రధాని ప్రసంగించడం ఆనవాయతీ. అయితే, గురు తేగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ.