ఆంధ్ర మహిళా రైతుతో మాట్లాడిన ప్రధాని మోడీ

ఆంధ్ర మహిళా రైతుతో మాట్లాడిన ప్రధాని మోడీ

Pm Kisan Scheme

PM-Kisan scheme: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN Yojana) పథకం కింద రైతులji ఎనిమిదవ విడత నగదును విడుదల చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద అందించాల్సిన 8 వ విడత ఆర్థిక ప్రయోజనాలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. దీంతో నేడు దేశంలోని 9.5కోట్లకు పైగా లబ్ధిదారుల రైతు కుటుంబాలకు రూ .19వేల కోట్లను బదిలీ చేశారు.

ఈ సంధర్భంగా రైతులు ఆదాయం పెంచుకునేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టిపెట్టాలని సూచించారు మోడీ. ఈ పథకం ద్వారా ఒక్కోరైతు ఈ విడతలో రూ.2,000 అందుకోనున్నారు. కేంద్రం రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా 3 విడతల్లో నగదు సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలు రైతుల ఖాతాల్లో వేస్తుంది.

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి చెందిన రమ అనే మహిళా రైతుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బంజరు భూములను సాగులోకి తీసుకువచ్చి రైతాంగానికి స్ఫూర్తిగా నిలిచారంటూ రమను కొనియాడారు మోడీ. తనకు ప్రభుత్వం ద్వారా లభించిన 4 ఎకరాల భూమిలో ప్రకృతి సేద్యం ద్వారా విభిన్నరకాల పంటలు పండించి లాభాలు రాబడుతున్నట్లు చెప్పారు. విజయగాథను విన్న ప్రధాని అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ వంటి ఐదు రాష్ట్రాల రైతులతో కూడా ప్రధాని మోడీ సంభాషించారు. కరోనా కాలంలో కూడా దేశంలోని రైతులు మన వ్యవసాయ రంగంలో రికార్డు సృష్టించారని, రికార్డు స్థాయిలో ధాన్యాన్ని ఉత్పత్తి చేశారని ప్రశంసించారు.