జాతినుద్దేశించి ఆడియో మెసేజ్ విడుదల చేసిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : May 30, 2020 / 10:16 AM IST
జాతినుద్దేశించి ఆడియో మెసేజ్ విడుదల చేసిన మోడీ

మోడీ2.0 పాలన ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఇవాళ(మే-30,2020)జాతినుద్దేశించి ఓ ఆడియో మెసేజ్ ను మోడీ విడుదల చేశారు. రెండోసారి తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా…ఈ ఏడాది పాలనలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను,సవాళ్లను విడదల చేసిన ఆడియోలో మోడీ తెలిపారు. ఎన్డీఏ-2 ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలతో ఏడాది పాలన పూర్తిచేసుకున్నామని పేర్కొన్న మోడీ.. గతేడాది ఇదే రోజు భారత ప్రజాస్వామ్యంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైందని, అనేక దశాబ్దాల తర్వాత దేశం పూర్తి మెజారిటీతో పూర్తికాల ప్రభుత్వానికి ఓటేసిందన్నారు.

కరోనా సంక్షోభంగా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కార్మికులు, కూలీలు, రోజువారీ వేతనజీవుల గురించి ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. వలస కార్మికులు, కూలీలు, రోజువారీ వేతనజీవులు, ఇతరులు విపరీతమైన బాధలు అనుభవించారని…ఈ సంక్షోభంలో ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగలేదని తాము చెప్పడం లేదని మోడీ అన్నారు. లాక్‌డౌన్‌తో వేల సంఖ్యలో వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. స్వస్థలాలకు చేరుకునేందుకు నడక, సైకిళ్లు, ట్రక్కులను ఆశ్రయిస్తున్నారు. మన కూలీలు, వలస కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలు, చేతివృత్తులవారు, హస్త కళాకారులు, హాకర్లు ఈ సంక్షోభ సమయంలో తీవ్ర బాధలు అనుభవించారన్నారు. అయినప్పటికి ఈ బాధలు, ఇబ్బందులు, అసౌకర్యాలు విపత్తులుగా మారకుండా చూసుకోవాల్సిన సమయం ఇది అన్నారు.

20లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ…130కోట్ల జనాభా ఉన్న దేశాని సెల్ఫ్ రిలయంట్(స్వీయ ఆధారపడటం)గామార్చడంలో ఓ పెద్ద అడుగుగా మోడీ వర్ణించారు. ప్రస్తుతం కరోనా ప్రమాదంతో పోరాడుతున్న ప్రపంచానికి ఆర్థిక పునరుజ్జీన ఉదాహరణను భారత్ సెట్ చేయబోతుందని మోడీ అన్నారు. 130కోట్ల భారతీయులు ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చడమే కాకుండా ఇన్స్ పైర్(ప్రేరేపించడం)చేయగలరని మోడీ తెలిపారు.

అత్మనిర్భర్ భారత్ అభియాన్ కోసం ప్రకటించిన ప్యాకేజీ… ప్రతి భారతీయునికి కొత్త యుగపు అవకాశాల్లో దారిచూపుతుందన్నారు. అది రైతులు, కార్మికులు, చిన్న పారిశ్రామికవేత్తలు లేదా స్టార్టప్‌లతో సంబంధం ఉన్న యువత కావచ్చు అని మోడీ2.0కు మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పౌరులకు రాసిన లేఖలో మోడీ చెప్పారు. భారతదేశం ప్రాముఖ్యత రోజురోజుకి పెరుగుతుందని మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పేదల గౌరవం ఇనుమడిస్తుందన్నారు. తన ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా గ్రామీణ-పట్టణాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయన్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు, ఇది జాతీయ ఐక్యత మరియు సమైక్యత యొక్క స్ఫూర్తిని పెంపొందించిందన్నారు.

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా నిరసనలు చూసిన పౌరసత్వ సవరణ చట్టంపై స్పందిస్తూ ఇది భారతదేశం యొక్క కరుణ మరియు సమగ్ర స్ఫూర్తికి వ్యక్తీకరణ అని తెలిపారు. కరోనా దేశంలోకి వచ్చినప్పుడు.. భారత్‌ ప్రపంచానికి సమస్యగా మారుతుందని భయపడ్డారు.. కానీ, నేడు మనం తీసుకున్న చర్యలతో ప్రపంచమే మన వైపు చూస్తుందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందన్న ఆయన.. భారతీయుల సమిష్టి బలం, సామర్థ్యంతో ఇది నిరూపితమైందన్నారు. ప్రపంచంలోని శక్తివంతమైన, సంపన్న దేశాలతో పోల్చితే ఇది అసమానం అని.. చప్పట్లు చరవడం, దీపాలు వెలిగించడం, కరోనా యోధులను ఆర్మీ గౌరవించడం, జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ నియమాలను పాటించడం.. ఇలా ప్రతీ సందర్భంలోనూ ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌ అని నిరూపించారని ప్రధాని తెలిపారు.

Read:  ఈ ప్రయాణంలో మోడీ హీరో.. ఆరేళ్లలో ఆరు దశాబ్దాల అభివృద్ధి: అమిత్ షా