PM Modi: స్పెషల్ డే సందర్భంగా.. రూ.125 కాయిన్ రిలీజ్ చేసిన మోదీ
ప్రధాని మోదీ ప్రత్యేక రోజు పురస్కరించుకుని రూ.125 రూపాయల నాణేన్ని విడుదల చేశారు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు ప్రభు పాదస్వామి 125వ జయంతి వేడుకల సందర్భంగా ....

PM Modi: ప్రధాని మోదీ ప్రత్యేక రోజు పురస్కరించుకుని రూ.125 రూపాయల నాణేన్ని విడుదల చేశారు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు ప్రభు పాదస్వామి 125వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. . ఈ కార్యక్రమానికి మంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఇస్కాన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇస్కాన్‌తో కృష్ణతత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత స్వామి శ్రీల ప్రభుపాదకే చెందుతుందని కొనియాడారు ప్రధాని మోదీ.
ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లను స్థాపించి మానవాళికి ఇస్కాన్ సేవ చేస్తుందన్నారు. పాశ్యాత్యదేశాలకు భారత్‌ను అనుసంధానం చేశారని చెప్పారు కిషన్‌రెడ్డి.
రూ.125 రూపాయల నాణెం ఆకర్షణీయంగా ఉండగా.. ఇందులో జాతీయ చిహ్నమైన అశోక స్తంభం నాణేనికి ఇటువైపు ముద్రించబడి ఉంటుంది. మరొక వైపు ప్రభుపాద స్వామి చిత్రం ఉంటుంది. ఇటువంటి స్మారక నాణేలు గతంలో కూడా జారీ చేయబడ్డాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.125 నాణెం విడుదల చేసింది. ఇటువంటి నాణేలను మెమెంటోగా జారీ చేస్తుంది ప్రభుత్వం. గతంలోనూ 2019 అక్టోబర్ 9న పరమహంస యోగానంద 125వ జయంతి సందర్భంగా కూడా ఈస్మారక నాణేన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 125 రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేశారు.
సాధారణ నాణేల మాదిరిగానే ఉండటం వలన వాటి విలువ చలామణిలో ఉన్న ఇతర నాణేల కంటే ఎక్కువగా ఉంటుంది. గొప్ప వ్యక్తులను విశ్వసించే వ్యక్తులు లేదా సాధారణ వ్యక్తులు కూడా ఈ నాణేలను సేకరించి దాచుకోవాలని కోరుకుంటారు. అలాంటి వ్యక్తులు ఆర్బీఐ నిర్ణయించిన ధరకే నాణేలను కొనుగోలు చేయవచ్చు.
కొనుగోలు చేయడానికి ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. RBI ముంబై, కోల్‌కతాలోని భారత ప్రభుత్వ మింట్ కార్యాలయాలు ఇటువంటి ప్రత్యేక ఎడిషన్ నాణేలు, స్మారక నాణేలను జారీ చేస్తాయి. ఇవి సెక్యూరిటీస్ ప్రింటింగ్, కరెన్సీ తయారీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కిందకు వస్తాయి.