PM Modi : టోక్యో ఒలంపిక్స్ కి ప్రిపరేషన్స్పై ప్రధాని రివ్యూ

50 రోజుల్లో టోక్స్ ఒలంపిక్స్ మొదలు కానున్న నేపథ్యంలో ఈ మెగా స్పోర్ట్స్ కి సంబంధించి దేశపు సన్నాహాలపై గురువారం ప్రధాని సమీక్షించారు.

PM Modi 50 రోజుల్లో టోక్స్ ఒలంపిక్స్ మొదలు కానున్న నేపథ్యంలో ఈ మెగా స్పోర్ట్స్ కి సంబంధించి దేశపు సన్నాహాలపై గురువారం ప్రధాని సమీక్షించారు. వ్యాక్సినేషన్ నుండి శిక్షణా సదుపాయాల వరకు భారత క్రీడాకారుల యొక్క ప్రతి అవసరాన్ని మొదటి ప్రాధాన్యతగా నెరవేర్చాలని సంబంధిత అధికారులకు మోడీ సూచించారు. ఈ మెగా క్రీడా కార్యక్రమం కోసం టోక్యోకు వెళ్లే ప్రతి అర్హత మరియు సంభావ్య అథ్లెట్, సహాయక సిబ్బంది మరియు అధికారులకు వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రధాని ఆదేశించారు.

స్పోర్ట్స్ మన దేశ క్యారక్టర్ లో ఓ భాగమని, మన యువత క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపుతారని మోడీ చెప్పారు. 135 కోట్లమంది భారతీయుల ఆశలు ఈ ఒలంపిక్స్ లో పాల్గొనే యువతపైనే ఉంటాయన్నారు. ప్రపంచ వేదికపై మెరుస్తున్న ప్రతి క్రీడాకారుడిని చూసి… క్రీడల్లో పాల్గొనేందుకు వెయ్యి మంది ప్రేరణ పొందుతారని అన్నారు. జులైలో మన క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతానని ప్రధాని ప్రకటించారు. వారిని ఎంతగానో ప్రోత్సహిస్తానని, గర్వించదగిన ఈ దేశం మీకు అండగా ఉంటుందని చెబుతానని ఆయన అన్నారు. కాగా అథ్లెట్లకు నిరంతర శిక్షణ లభించేలా చూడడం, ఒలంపిక్ పతకాలు దక్కించుకునేలా వారిని ఈ అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధం చేయడం, వారికి వ్యాక్సినేషన్ వంటి వాటిపై అధికారులు మోడీకి వివరించారు. ఓ ప్రెజెంటేషన్ కూడా సమర్పించారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే టోక్యో ఒలంపిక్స్ కి 11 క్రీడా విభాగాల్లో మొత్తం 100 మంది అథ్లెట్లు అర్హత సాధించారని, మరో 25 మంది అథ్లెట్లు అర్హత సాధించే అవకాశం ఉందని అధికారులు మోడీకి వివరించారు.

మరోవైపు. జపాన్ లో కోవిడ్ వేవ్ ఉన్నప్పటికీ టోక్యో ఒలంపిక్స్ యధాతథంగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని టోక్స్ 2020 ఒలంపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్ సీకో హషిమొటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సృష్టం చేశారు. ఒకవేళ ఈ పోటీలు జరుగుతున్న సమయంలో కోవిడ్ వ్యాప్తి ప్రబలమైన పక్షంలో అభిమానులకు ప్రవేశం ఉండదని..వారు తమ ఇళ్లలోనే వీటిని చూడాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు